ఈ బ్లాగును సెర్చ్ చేయండి

31, జనవరి 2016, ఆదివారం

మిస్డ్ కాల్ తో ఫోన్ లో మినీ స్టేట్ మెంట్ మరియు బాలన్సు ఎంక్వయిరీ ...........

అశోకచేలిక

Image result for sbi miss call balance
ఎకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవాలంటే ఏటీఎం గానీ, బ్యాంక్ కైనా వెళ్లాలి. ఆఖరి ఐదు లావాదేవీల గురించి తెలుసుకోవాలన్నా సేమ్ ప్రోసెస్ ను ఫాలో కాక తప్పదు. దీంతో కస్టమర్ల కోసం ఈజీ ప్రొసెస్ ను ఇంట్రడ్యూస్ చేసింది ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’. ఒక్క మెసేజ్ చేస్తే చాలు ఎకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ ‘ఎస్బీఐ క్విక్’ ను చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య ప్రారంభించారు.  ఈ కొత్త స్కీంతో ఏటీఎంకు వెళ్లకుండానే బ్యాలెన్స్, ఆఖరి ఐదు లావాదేవీలను తెలుసుకోవచ్చు.
ముందుకు కస్టమర్ REG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి 9223488888 అనే నెంబర్ కు మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత క్విక్ స్కీం యాక్టివేట్ అవుతోంది. ఎకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవాంటే BAL అని టైప్ చేసి 9223766666  నెంబర్ కు మెసేజ్ పంపాలి. మెసేజ్ డెలివరీ అయిన రెండు నిమిషాల్లో ఎంత డబ్బులు ఉన్నాయో రిప్లై మెసేజ్ వస్తుంది.
ఇక లాస్ట్ ఐదు బ్యాంక్ లావాదేవీలు కూడా తెలుసుకోవాలంటే  MSTMT  అని టైప్ చేసి 9223866666 నెంబర్ కు మెసేజ్ పంపాలి. ఏటీఎం కార్డ్ పోయినా కూడా మొబైల్ నుంచే దాన్ని బ్లాక్ చేయించే ప్రోసెస్ ను కూడా ఎస్ బీఐ కల్పించింది. BLOCK అని టైప్ చేసి ఏటీఎం కార్డ్ లాస్ట్ నాలుగు నెంబర్లు టైప్ చేసి 567676 నెంబర్ కు మెసేజ్ పంపితే వెంటనే ఏటీఎం కార్డ్ బ్లాక్ అవుతుంది



అదేవిధంగా


ఇక పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నుండి బ్యాలెన్స్ ఎంక్వైరీ మరియు మిని స్టేట్ మెంట్ మీ రిజిస్టర్డ్ మొబైల్ లో ఎప్పుడంటే అప్పుడు..
ఇందుకోసం మొదటగా SBH ACCOUNT వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ను మీ రిజిస్టర్డ్ మొబైల్ నుండే చేసుకోవాలి. అది ఎలాగంటే
REGSBH<space>ACCOUNT NUMBER
టైప్ చేసి 9223488888 అనే నెంబరుకు మెసేజ్ చెయ్యాలి.
ఆ తర్వాత మీకు State Bank Team నుండి
Dear SBH Customer,You are successfully registered for SBH Quick facility.....
అనే మెసేజ్ వస్తుంది. దీంతో రిజిస్ట్రేషన్ పూర్తయినట్లే.
.
ఆ తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ కొరకు 9223766666 అనే నెంబరుకు
మిని స్టేట్ మెంట్ కొరకు 9223866666 అనే నెంబరుకు
Missed Call ఇస్తే సరి.
మీరు క్షణాల్లో మీ మొబైల్ లో మీ అకౌంట్ కు సంబందించిన మెసేజ్ అందుకుంటారు





మీ

ashokchelika

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి