నమస్కారం ట్రేడర్స్!
మీరు ఆప్షన్స్ లేదా ఈక్విటీ ట్రేడింగ్ చేస్తూ, మార్కెట్‌లో సరైన ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.
ప్రకృతిలో పువ్వులు, గెలాక్సీలు, తుఫాన్ల నిర్మాణంలో ఒక మ్యాథమెటికల్ సీక్రెట్ దాగి ఉందని మీకు తెలుసా? అదేంటంటే మార్కెట్ చార్ట్స్ లో కూడా అద్భుతంగా పని చేస్తుంది! అదే "ఫిబొనాచీ రీట్రేస్‌మెంట్ (Fibonacci Retracement)". ఈ అద్భుతమైన ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీని సింపుల్ గా ఎలా వాడాలో, హై-విన్ రేట్ ట్రేడ్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. స్టాక్ మార్కెట్ లేదా క్రిప్టో ట్రేడింగ్‌లో సరైన ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్స్‌ను కనుగొనడం చాలా మంది ట్రేడర్లకు ఒక పెద్ద సవాల్. చార్ట్‌లో మార్కెట్ పుల్ బ్యాక్ (Pullback) ఎక్కడ ఎండ్ అవుతుందో అంచనా వేయలేక చాలాసార్లు రాంగ్ ట్రేడ్స్ తీసుకుంటూ నష్టపోతుంటాం.
1. అసలు ఫిబనాచి రిట్రేస్మెంట్ అంటే ఏమిటి?
2. ఫిబనాచి లెవెల్స్ సరిగ్గా ఎలా డ్రా చేయాలి? (How to Plot)
- అప్ ట్రెండ్ (Uptrend): మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు, చార్ట్‌లోని స్వింగ్ లో (Swing Low) నుంచి స్వింగ్ హై (Swing High) వరకు ఫిబనాచి టూల్‌ను (క్యాండిల్స్ విక్స్ ని పరిగణలోకి తీసుకుంటూ) కింద నుంచి పైకి డ్రా చేయాలి.
- డౌన్ ట్రెండ్ (Downtrend): మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు, స్వింగ్ హై నుంచి స్వింగ్ లో వరకు పై నుంచి కిందకి డ్రా చేయాలి. దీన్ని నిర్ధారించడానికి 200 EMA లాంటి ఇండికేటర్స్ సహాయంతో లాంగ్ టర్మ్ ట్రెండ్‌ను గుర్తించడం చాలా ముఖ్యం.
3. ముఖ్యమైన ఫిబనాచి లెవెల్స్ (Golden Zones)
- 38.2% (0.382)
- 50% (0.5)
- 61.8% (0.618) - వీటిని ట్రేడింగ్ లో అత్యంత ముఖ్యమైన "గోల్డెన్ జోన్స్" అంటారు. మార్కెట్ మోస్ట్ కామన్ గా ఈ లెవెల్స్ నుంచే రివర్స్ లేదా పుల్ బ్యాక్ అవుతుంది.
- ఒకవేళ వీటిని బ్రేక్ చేస్తే 78.6% మరియు 100% లెవెల్స్ వరకు కూడా ప్రైస్ వచ్చే అవకాశం ఉంటుంది.
4. ప్రైస్ యాక్షన్‌తో కన్ఫర్మేషన్ & ట్రేడ్ ఎంట్రీ
- ఆ లెవెల్ వద్ద ప్రైస్ రిజెక్షన్ చూపించడం.
- బుల్లిష్ లేదా బేరిష్ ఎంగల్ఫింగ్ (Engulfing) క్యాండిల్స్ ఫామ్ అవ్వడం.
- ఆ లెవెల్స్ చుట్టూ మల్టిపుల్ క్యాండిల్స్ క్లోజ్ అవ్వడం.ఇలాంటి కన్ఫర్మేషన్స్ వచ్చాక సరైన స్టాప్ లాస్ (స్వింగ్ లో కింద లేదా పైన) పెట్టుకుని ట్రేడ్ తీసుకోవలి.
- Confluence Area మీరు ఇంకా పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం చూస్తున్నట్లయితే ఒక చిన్న ట్రిక్ ఉంది. మీ చార్ట్ లోని ప్రీవియస్ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లెవెల్స్ గనుక, ఈ ఫిబొనాచీ 50% లేదా 61.8% లెవెల్స్ తో కో-ఇన్సైడ్ (రెండూ ఒకే చోట కలిస్తే) అయితే.. దాన్ని 'కాన్ఫ్లూయెన్స్ ఏరియా' అంటారు. ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యి మీ టార్గెట్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ