ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, అక్టోబర్ 2016, బుధవారం

తెలంగాణా లో ఆన్ లైన్ ద్వారా ఇసుక బుకింగ్ చేసే విధానము

తెలంగాణా లో ఆన్ లైన్ ద్వారా ఇసుక బుకింగ్ చేసే విధానము

ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకోవడం కొరకు ఈ క్రింది తెలిపిన విధం గా అనుసరించండి.

  • ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకోవడం కొరకు http://tsmdc.telangana.gov.in/ అనే వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి 



  • లింక్ పైన క్లిక్ చేసాక జిల్లా ని ఎంచుకోండి.
  • స్టాక్ యార్డ్ పేరు, అందుబాటులో ఉన్న పరిమాణము మరియు వెల కనిపిస్తుంది. 
  • మీకు కావలసిన స్టాక్ యార్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. 
  • మీ పేరు, ఆర్డర్ కి సంబందించిన వివరాలు మరియు ఎక్కడికి చేర్చాలో అక్కడి చిరునామా ఇవ్వండి. 
  • తరువాత రిజిస్టర్ మీద క్లిక్ చేయండి.
  • ఆన్లైన్ లో చెల్లించుటకు మీ బ్యాంకు ని ఎంచుకోండి, నెట్ బ్యాంకింగ్ కొరకు కావలసిన వివరాలు అందించండి.
  • మే చెల్లింపు పూర్తి అయాక “GET RECEIPT” మీద క్లిక్ చేసి మీ రశీదు పొందండి.
  • మన  జమ్మికుంట ఇసుక  వివరాలకు సంప్రదించండి 



మరింత సమాచారం కొరకు TSMDC



అశోక్ చేలిక 

25, అక్టోబర్ 2016, మంగళవారం

డిజి లాకర్‌

ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో భద్రపరుచుకునేందుకు డిజి లాకర్ సదుపాయాన్ని ఉచితంగా కేంద్ర సర్కారు అందుబాటులోకి తెచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులు సర్టిఫికెట్లను వెంట తీసుకువెళ్లే అవసరం లేకుండా, దీని ద్వారా ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ ప్రింట్ తీసుకుని వాడుకునే సౌలభ్యం ఉంది. ఆధార్ సంఖ్య ఉంటే చాలు డిజిటల్ లాకర్ తెరిచి, ప్రతి వ్యక్తి 10 ఎంబీ డేటాను భద్రపరుచుకునే వీలుంటుంది. 
సాధారణంగా ఒక పత్రం 200 కేబీలోపే ఉంటుంది. ఈ లెక్కన 50 పత్రాల వరకు సురక్షితంగా దాచుకొవచ్చు. అయితే డిజిటల్ సాంకేతికతను సామాన్యులు త్వరగా వినియోగించకోలేరన్న వాదనలు వినిపిస్తున్నా.. ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా వాడకం పెరగడాన్ని బట్టి చూస్తే ఈ అభిప్రాయం తప్పని తెలుస్తున్నది.
డిజి లాకర్ సదుపాయాన్ని గుర్తిస్తే అక్షరజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ ఖాతాలను తెరిచేందుకు ముందుకు వస్తారనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి తెస్తున్నందున డిజి లాకర్‌కు మంచి స్పందన లభించే అవకాశం ఉంది. ఈ డిజిటల్ సేవ పూర్తిగా ఉచితం. విద్యార్హత, నివాస ధ్రువపత్రాలు డైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, వ్యక్తిగత పత్రాలతోపాటు రేషన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆదాయ పన్ను ఖాతా, పాన్ కార్డు నంబర్, వంటి కీలక పత్రాలన్నింటినీ డిజి లాకర్‌లో దాచుకోవచ్చు. ఈ పత్రాలన్నీ క్లౌడ్ పద్ధతిలో సురక్షితంగా ఉంటాయి. ఆయా డిజిటల్ పత్రాలను ప్రభుత్వం పరిశీలించి ఆమోదిస్తుంది. కనుక ఎక్కడైనా ముద్రించి తీసి ఇవ్వవచ్చు. మనం వెళ్లే ప్రాంతానికి ఇక పత్రాలన్నీ మోసుకెళ్లాల్సినా పని ఉండదు.

డిజి లాకర్ ఇలా తెరవవచ్చు

  • ఎవరైనా డిజిటల్ లాకర్‌లో నమోదు చేసుకోవాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ నమోదు సమయంలో వారిచ్చిన సెల్‌ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉండాలి.
  • అవి తెలిసిన వారు digilocker.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి సైన్‌ఆప్ క్లిక్ చేయాలి.
  • మీరు సైన్‌ఆప్ క్లిక్ చేయగానే మిమ్మల్ని సెల్ నంబర్ అడుగుతుంది. ఆ సెల్ నంబర్ ఎంటర్ చేయగానే ఆ నంబర్ కు ఓటీపీ కోడ్ వస్తుంది. అలాగే మెయిల్ కి కూడా ఓ సందేశం వస్తుంది.

  • ఆ నంబర్ కింద ఓ డబ్బాలాంటి బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో మీకు వచ్చిన సందేశాన్నినమోదు చేయాలి.
  • అప్పుడు యూసర్ నేమ్, పాస్‌వర్డ్ అడుగుతోంది. వెంటనే వాటిని భర్తీ చేయాగానే ఆధార్ నెంబర్ అడుగుతుంది.
  • ఆధార్ సంఖ్య నమోదు చేసిన తర్వాత సంబంధిత నెట్‌లోకి ప్రవేశించవచ్చు. అక్కడ మీకు సంబంధించిన అన్ని ముఖ్యమైన పత్రాలను దాచుకోవచ్చు.
  • మీరు అప్ లోడ్ చేసే ప్రతి పత్రానికి ఓటీపీ కోడ్ వస్తుంది. దీంతో సురక్షితంగా ఈ పత్రాలను ఇతరులకు పంపవచ్చు.
  • ఇక్కడ పత్రం సైజ్ కి లిమిట్ ఉంటుంది. ఒక్కో పత్రం 10 ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ అది తీసుకోదు. ఒక్కో ఖాతాకు 1 జిబి వరకు స్పేస్ ఉంటుంది.
  • ఈ డిజిటల్ లాకర్ కి పాస్ వర్డ్ ఉంటుంది కాబట్టి మీ పత్రాలన్నీ సేఫ్ గా ఉంటాయి. మీరునేరుగా నెట్ నుంచే మీరు అనుకున్న చోటుకు పంపవచ్చు. ఆధార్‌లో నమోదైన వివరాలనే డిజిటల్ లాకర్ వ్యక్తిగత వివరాలుగా తీసుకుంటుంది కాబట్టి ఎటువంటి మోసాలు ఇక్కడ ఉండవు.
  • ఇందులో పత్రాలు భద్రపర్చుకోవడంతో పాటు ఈ-సైన్ కు అవకాశం ఉంది. ఈ-సైన్‌పై క్లిక్ చేస్తే ధ్రువపత్రంపై మన సంతకం చేసినట్లు తెలుపుతుంది. నెట్‌లో దరఖాస్తులు కోరేవారికి దీని ద్వారా సులభంగా పంపవచ్చు. ఆధార్‌తో అనుసంధానం ఉంటుంది కాబట్టి మీసేవలో మీరు పొందిన ధ్రువపత్రాలు ఆటోమేటిక్‌గా డీజీలాకర్‌లోని మన ఖాతాలోకి వచ్చేస్తాయి.
  • మీ వివరాలను నేరుగా కంపెనీమెయిల్ కి కాని లేకుంటే మీ ప్రెండ్స్ కి కాని షేర్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.

నమోదు చేసుకోండి

    ప్రయోజనాలు ఇవీ




  • నకిలీ ధ్రువపత్రాలను నివారించవచ్చు
  • ఎక్కడికి వెళ్లినా పత్రాలను తమతో తీసుకెళ్లాల్సినా అవసరం తప్పతుంది.
  • పొగొట్టుకోవడం, చోరీకి గురవుతాయనే భయం ఉండదు.
  • ఇళ్లు, కార్యాలయాల్లో అగ్నిప్రమాదాలు జరిగినా డోకా ఉండదు.
  • ఫొటోసాఫ్ట్ కాపీలతో అవసరం లేకుండా ఎప్పుడైనా ఎక్కడికైనా పంపే వెసులుబాటు ఉంటుంది.
  • మొబైల్ ద్వారా కూడ డిజిటల్ లాకర్‌ను వాడుకోవచ్చు.
  • పాస్‌వర్డ్ వాడుతున్నందున ఇతరుల నుంచి ధ్రువపత్రాలకు రక్షణ ఉంటుంది.

  • భద్రపరుచుకోదగిన పత్రాలు




  • ఆధార్‌లో నమోదైన పత్రాలను డిజిటల్ లాకర్ వ్యక్తిగత వివరాలుగా తీసుకుంటుంది.
    1. విద్యార్హత ధ్రువపత్రాలు, బీమా పాలసీలు బాండ్లు, ప్రభుత్వం జారీ చేసిన విలువైన అన్ని గుర్తింపు కార్డులు, విద్యుత్ , నీరు. టెలిఫోన్, ఆస్తి పన్ను రశీదులు వంటివి భద్రపరుచుకోవచ్చు.


    అశోక్ చేలిక 

    3, అక్టోబర్ 2016, సోమవారం

    రేషన్ షాప్ లో రేషన్ రడీగా ఉందంటూ ఎస్ఎంఎస్ కావాలా ?


    స్టెప్ 1
    ముందుగా  మీ ఇంటర్నెట్ బ్రౌజరు ను ఓపెన్ చేసి  అడ్రస్ బార్ లో http://epds.telangana.gov.in/      అనే అడ్రస్ ను టైపు చేసి  ఎంటర్ ప్రెస్ చేయండి 
    స్టెప్ 2

     ఇప్పుడు    SMS Registration   అనే లింక్  పై  క్లిక్  చేయాలి 
    స్టెప్ 3

    MobileNumber:
    FirstName:
    LastName:
    State:
    District
    Mandal
    FpShopNumber
    Beneficiary category
    పైన  మీ మొబైల్  నెంబర్ మరియు పేరు  మొదలగునవి  నింపాలి
    తర్వాత  submit బటన్ పై క్లిక్ చేయండి 
    అంతే  మీ మొబైల్కు రేషన్ షాప్ లో రేషన్  రడీగా ఉందంటూ ఎస్ఎంఎస్  వస్తుంది 

      
    స్టెప్ 4

    ఒక వేళా  మీకు రేషన్ షాప్ నెంబర్ తెలుసుకోవాలంటే  http://epds.telangana.gov.in/      హోమ్ పేజీ లో   search   అనే లింక్ పై  క్లిక్ చేయాలి 
    స్టెప్ 5

    ఆ తరువాత       FSC Search  లేదా  FSC Application Search    అనే ఆప్షన్  తీసుకోని  Uid No    లేదా  Application No లేదా   MeeSeva No  ఎంటర్  చేసి   మీ యొక్క   FPShop No :  నెంబర్ తెలుసుకోగలరు 




    అశోక్ చేలిక 

    నాకు ఇష్టమైన ఆండ్రాయిడ్ ఆప్స్

                                                                                                                

    వైపై  టాకీ ఆండ్రాయిడ్ ఆప్

    ఈ అప్ ద్వారా   ఫ్రీగా కాల్ మరియు చాటింగ్ ఇంకా ఫైల్స్ కూడా  పంపుకోవచ్చు ........ 

    మొదటి  వ్యక్తి ఫోన్ నుండి  హాట్ స్పాట్  ఆన్  చేసి  మిగిలిన  వారి  ఫోన్స్  నుండి  వైఫై  కి కనెక్ట్  కావాలి   ..... 
    మనం చిన్నప్పుడు ఆడుకున్నా వాక్ టాకీ  లాగ వర్క్  చేస్తుంది 

    ఒక్కసారి  ప్రయతించి చుడండి 

    డౌన్లోడ్  లింక్                                      వైపై టాకీ డౌన్లోడ్.apk
                                                                                                                                                                      

    మెసేజ్ పాప్ అప్  ఆండ్రాయిడ్ ఆప్


    డౌన్లోడ్  లింక్                                         మెసేజ్ పాప్ అప్.apk.

                                                                                                                                                                      

    పిడిఎఫ్ మరియు ఆఫీస్  వ్యూయర్   ఆండ్రాయిడ్ ఆప్

    డౌన్లోడ్  లింక్                                   క్విక్ ఆఫీస్.apk        
                                                                                                                                                                     

    స్క్రీన్ రికార్డు    ఆండ్రాయిడ్ ఆప్

    డౌన్లోడ్  లింక్                                  స్క్రీన్ రికార్డు.apk

                                                                                                                                                                      

    స్టేట్ బ్యాంకు ఎనీవేర్


     డౌన్లోడ్  లింక్                               గూగుల్  ప్లే స్టోర్  నుండి డౌన్లోడ్ చేసుకోండి 
                                                                                                                                                                       

    ఇమో  

     డౌన్లోడ్  లింక్                               గూగుల్  ప్లే స్టోర్  నుండి డౌన్లోడ్ చేసుకోండి    


    మరిన్ని  యాప్స్   త్వరలో  ఆడ్ చేస్తాను.. 



    ధన్యవాదాలు 
    మీ 
    అశోక్ చేలిక