Showing posts with label ashok chelika. Show all posts
Showing posts with label ashok chelika. Show all posts

Tuesday, October 25, 2016

డిజి లాకర్‌

ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో భద్రపరుచుకునేందుకు డిజి లాకర్ సదుపాయాన్ని ఉచితంగా కేంద్ర సర్కారు అందుబాటులోకి తెచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులు సర్టిఫికెట్లను వెంట తీసుకువెళ్లే అవసరం లేకుండా, దీని ద్వారా ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ ప్రింట్ తీసుకుని వాడుకునే సౌలభ్యం ఉంది. ఆధార్ సంఖ్య ఉంటే చాలు డిజిటల్ లాకర్ తెరిచి, ప్రతి వ్యక్తి 10 ఎంబీ డేటాను భద్రపరుచుకునే వీలుంటుంది. 
సాధారణంగా ఒక పత్రం 200 కేబీలోపే ఉంటుంది. ఈ లెక్కన 50 పత్రాల వరకు సురక్షితంగా దాచుకొవచ్చు. అయితే డిజిటల్ సాంకేతికతను సామాన్యులు త్వరగా వినియోగించకోలేరన్న వాదనలు వినిపిస్తున్నా.. ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా వాడకం పెరగడాన్ని బట్టి చూస్తే ఈ అభిప్రాయం తప్పని తెలుస్తున్నది.
డిజి లాకర్ సదుపాయాన్ని గుర్తిస్తే అక్షరజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ ఖాతాలను తెరిచేందుకు ముందుకు వస్తారనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి తెస్తున్నందున డిజి లాకర్‌కు మంచి స్పందన లభించే అవకాశం ఉంది. ఈ డిజిటల్ సేవ పూర్తిగా ఉచితం. విద్యార్హత, నివాస ధ్రువపత్రాలు డైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, వ్యక్తిగత పత్రాలతోపాటు రేషన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆదాయ పన్ను ఖాతా, పాన్ కార్డు నంబర్, వంటి కీలక పత్రాలన్నింటినీ డిజి లాకర్‌లో దాచుకోవచ్చు. ఈ పత్రాలన్నీ క్లౌడ్ పద్ధతిలో సురక్షితంగా ఉంటాయి. ఆయా డిజిటల్ పత్రాలను ప్రభుత్వం పరిశీలించి ఆమోదిస్తుంది. కనుక ఎక్కడైనా ముద్రించి తీసి ఇవ్వవచ్చు. మనం వెళ్లే ప్రాంతానికి ఇక పత్రాలన్నీ మోసుకెళ్లాల్సినా పని ఉండదు.

డిజి లాకర్ ఇలా తెరవవచ్చు

  • ఎవరైనా డిజిటల్ లాకర్‌లో నమోదు చేసుకోవాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ నమోదు సమయంలో వారిచ్చిన సెల్‌ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉండాలి.
  • అవి తెలిసిన వారు digilocker.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి సైన్‌ఆప్ క్లిక్ చేయాలి.
  • మీరు సైన్‌ఆప్ క్లిక్ చేయగానే మిమ్మల్ని సెల్ నంబర్ అడుగుతుంది. ఆ సెల్ నంబర్ ఎంటర్ చేయగానే ఆ నంబర్ కు ఓటీపీ కోడ్ వస్తుంది. అలాగే మెయిల్ కి కూడా ఓ సందేశం వస్తుంది.

  • ఆ నంబర్ కింద ఓ డబ్బాలాంటి బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో మీకు వచ్చిన సందేశాన్నినమోదు చేయాలి.
  • అప్పుడు యూసర్ నేమ్, పాస్‌వర్డ్ అడుగుతోంది. వెంటనే వాటిని భర్తీ చేయాగానే ఆధార్ నెంబర్ అడుగుతుంది.
  • ఆధార్ సంఖ్య నమోదు చేసిన తర్వాత సంబంధిత నెట్‌లోకి ప్రవేశించవచ్చు. అక్కడ మీకు సంబంధించిన అన్ని ముఖ్యమైన పత్రాలను దాచుకోవచ్చు.
  • మీరు అప్ లోడ్ చేసే ప్రతి పత్రానికి ఓటీపీ కోడ్ వస్తుంది. దీంతో సురక్షితంగా ఈ పత్రాలను ఇతరులకు పంపవచ్చు.
  • ఇక్కడ పత్రం సైజ్ కి లిమిట్ ఉంటుంది. ఒక్కో పత్రం 10 ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ అది తీసుకోదు. ఒక్కో ఖాతాకు 1 జిబి వరకు స్పేస్ ఉంటుంది.
  • ఈ డిజిటల్ లాకర్ కి పాస్ వర్డ్ ఉంటుంది కాబట్టి మీ పత్రాలన్నీ సేఫ్ గా ఉంటాయి. మీరునేరుగా నెట్ నుంచే మీరు అనుకున్న చోటుకు పంపవచ్చు. ఆధార్‌లో నమోదైన వివరాలనే డిజిటల్ లాకర్ వ్యక్తిగత వివరాలుగా తీసుకుంటుంది కాబట్టి ఎటువంటి మోసాలు ఇక్కడ ఉండవు.
  • ఇందులో పత్రాలు భద్రపర్చుకోవడంతో పాటు ఈ-సైన్ కు అవకాశం ఉంది. ఈ-సైన్‌పై క్లిక్ చేస్తే ధ్రువపత్రంపై మన సంతకం చేసినట్లు తెలుపుతుంది. నెట్‌లో దరఖాస్తులు కోరేవారికి దీని ద్వారా సులభంగా పంపవచ్చు. ఆధార్‌తో అనుసంధానం ఉంటుంది కాబట్టి మీసేవలో మీరు పొందిన ధ్రువపత్రాలు ఆటోమేటిక్‌గా డీజీలాకర్‌లోని మన ఖాతాలోకి వచ్చేస్తాయి.
  • మీ వివరాలను నేరుగా కంపెనీమెయిల్ కి కాని లేకుంటే మీ ప్రెండ్స్ కి కాని షేర్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.

నమోదు చేసుకోండి

    ప్రయోజనాలు ఇవీ




  • నకిలీ ధ్రువపత్రాలను నివారించవచ్చు
  • ఎక్కడికి వెళ్లినా పత్రాలను తమతో తీసుకెళ్లాల్సినా అవసరం తప్పతుంది.
  • పొగొట్టుకోవడం, చోరీకి గురవుతాయనే భయం ఉండదు.
  • ఇళ్లు, కార్యాలయాల్లో అగ్నిప్రమాదాలు జరిగినా డోకా ఉండదు.
  • ఫొటోసాఫ్ట్ కాపీలతో అవసరం లేకుండా ఎప్పుడైనా ఎక్కడికైనా పంపే వెసులుబాటు ఉంటుంది.
  • మొబైల్ ద్వారా కూడ డిజిటల్ లాకర్‌ను వాడుకోవచ్చు.
  • పాస్‌వర్డ్ వాడుతున్నందున ఇతరుల నుంచి ధ్రువపత్రాలకు రక్షణ ఉంటుంది.

  • భద్రపరుచుకోదగిన పత్రాలు




  • ఆధార్‌లో నమోదైన పత్రాలను డిజిటల్ లాకర్ వ్యక్తిగత వివరాలుగా తీసుకుంటుంది.
    1. విద్యార్హత ధ్రువపత్రాలు, బీమా పాలసీలు బాండ్లు, ప్రభుత్వం జారీ చేసిన విలువైన అన్ని గుర్తింపు కార్డులు, విద్యుత్ , నీరు. టెలిఫోన్, ఆస్తి పన్ను రశీదులు వంటివి భద్రపరుచుకోవచ్చు.


    అశోక్ చేలిక 

    Tuesday, July 14, 2015

    వీడియో ట్యుటోరియళ్ళు తయారుచేయండిలా ?


           చాల మంది కి యు ట్యూబ్ వంటి సైట్ లలో  వీడియో ట్యుటోరియళ్ళు ఎలా తయారు చేస్తారో తెలియదు
    వారికోసం ఈ ట్యుటోరియల్ 
     ముందుగ  కామ్‌ స్టూడియో సాఫ్ట్‌వేర్ ను డౌన్లోడ్ చేసుకోండి 
    డౌన్లోడ్ లింక్ ఈ టపా చివరలో ఇచ్చాడు  మీ అశోక్ చెలిక
     .
                           మనం కంప్యూటర్లో చేస్తున్న పనిని రికార్డ్ చేస్తూ దానికి తగిన వాఖ్యానాన్ని జోడిస్తే చాలు వీడియో ట్యుటోరియల్ పూర్తి అయినట్లే. మన కంప్యూటరు తెరని చిత్రీకరిస్తూ మన మాటలను రికార్డు చేయడానికి ఉపయోగ పడే  సాఫ్ట్‌వేర్ యే  ఈ   కామ్‌ స్టూడియో దీనిని  ఉపయోగించి  ఇంటర్ నెట్ మరియు కంప్యూటరు చిట్కాలను  లేదా ఇతర వీడియోస్ రికార్డ్ చేసి  యు ట్యూబ్ వంటి సైట్   అప్‌లోడ్ చేసుకోవచ్చు 
    కామ్‌స్టూడియోని ఈ  

      link    

    నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 



    థాంక్స్ 
    మీ 
    అశోక్ చేలిక
                            

    మీ ఆండ్రాయిడ్ ఫోన్ తో యుట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ చేయ్యాలనుకుంటున్నారా?

     సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారు గూగుల్ ప్లే లో వెతికి సులభంగా ఎన్నో రకాల అప్లికేషన్లు ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకుంటారు. కాని గూగుల్ నిబంధనల వల్ల ప్లే స్టోర్ నుండి యుట్యూబ్ వీడియో డౌన్లోడర్ అప్లికేషన్లు తొలగించబడినాయి. ట్యూబ్ మెట్   అన్న అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మనం  యుట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
      ట్యూబ్ మెట్ .apk అన్న ఫైల్నిtubemate.apk/ లింకు నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ 3 మరియు తదుపరి వెర్షన్లలో పనిచేస్తుంది. ఈ అప్లికేషన్ని ఉపయోగించి యుట్యూబ్ లో వీడియోలు ఏఏ ఫార్మాట్లలో అందుబాటులో ఉన్నాయో ఆయా ఫార్మాట్లలో మనం వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
    థాంక్స్ 
    మీ 
    అశోక్ చేలిక

    మీ ఆండ్రాయిడ్ ఫోన్ నే స్కానర్ గా మర్చుకొండిలా ?

    మన ఫోన్ లో camscanner  అప్లికేషను ను  ఇంస్టాల్ చేసుకోవడం ద్వారా మన స్మార్ట్ ఫోన్ ని స్కానర్ గా మార్చుకోవచ్చు. కాం స్కానర్ అను ఈ సాఫ్ట్ వేర్ ని ప్లే స్టోర్ నుండి ఉచితంగా పొందవచ్చు. ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాం స్కానర్ ని ఉపయోగించి మనం ఏదైనా డాక్యుమెంట్ ని స్కాన్ చేసుకొని పిడియఫ్ గా లేదా జెపిజి గా బధ్రపరుచుకోవచ్చు.

    ఫేస్బుక్ లైట్ వెర్షన్ వచ్చింది

     

     


      తక్కువ వేగం కలిగిన మొబైల్ నేట్ ని వాడే వినియోగదారులకి కూడా ఫేస్‌బుక్ వేగంగా తెరుచుకోబోతుంది. దానికోసం ఫేస్‌బుక్ లైట్ అనే అప్లికేషనుని విడుదలచేసింది. 
     ఇప్పటికి ఎక్కువగా వాడబడుతున్న 2జి నెట్‌వర్క్‌ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ ఫేస్‌బుక్ లైట్ అప్లికేషను సైజు యంబి కన్నా తక్కువ వుండటం వలన చాల త్వరగా ఇన్స్టాల్ అవుతుంది, తక్కువ మెమరీ ని ఆక్రమిస్తుంది. అంతేకాకుండా తక్కువ ఫోను వనరులని వాడుకుంటూ (ప్రాససర్, రామ్‌ మరియు బ్యాటరీ) దిగువ శ్రేణి మొబైళ్ళలో కూడా పనిచేసేలా దీనిని రూపొందించారు. మొబైల్ నెట్ వర్క్‌ల వాడేవారికి వేగంగా ఫేస్‌బుక్‌ను చూపించడమే కాకుండా డాటా తక్కువగా వాడుకుంటు సమయాన్ని, డబ్బులని ఆధా చేస్తుంది. ఆప్షన్ల విషయంలో సాధారణ వెర్షను ఫేస్‌బుక్ యాప్‌తో పోల్చలేనప్పటికి కనీస అవసరాలయిన అన్ని ఆప్షన్లు దీనిలో కూడా ఉందుబాటులో ఉన్నాయి.


    ఆండ్రాయిడ్ కోసం : డౌన్‌లోడ్

    విండోస్ కోసం : డౌన్‌లోడ్

    మీ పెన్ డ్రైవ్ ను సిస్టం యొక్క ర్యామ్ గా మార్చండి ఇలా

    మీ కంప్యుటర్ యొక్క ర్యామ్ తక్కువగా ఉంటే ఇ విధంగా చేయండి





    ముందుగా పెన్ డ్రైవ్ ని సిస్టం కి కన్నెక్ట్ చేసి ... దాని ప్రాపర్టీస్ లో ... రెడీ బూస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ..
    దాన్ని క్లిక్ చెయ్యండి ...
    అందులో మీకు ౩ రేడియో బట్టన్స్ కన్పిస్తాయి ....
    యూస్ థిస్ డివైస్ అని ఉన్న చోట క్లిక్ చేసి ... మీ పెన్ డ్రైవ్ లో ఎంత స్పేస్ రామ్ కి ఇవ్వదల్చుకున్నారో అంత స్పేస్ ఇచ్చి ...అప్లై చెయ్యండి ...


    మీ ఒరిజినల్ రామ్ లో మెమరీ తక్కువగ ఉన్నప్పుడు .. పెన్డ్రైవ్ ను రామ్ లా యూస్ అవుతుంది ....
    ఓకే నా ....
    థాంక్స్ 
     మీ 
    అశోక్ చేలిక

    జావా స్క్రిప్ట్ ఎనేబుల్ /డిసేబుల్ ఇలా ?


    For Firefox Users:

    Go to Tools > Options > Content and uncheck Enable Javascript and click OK.

    For Internet Explorer Users:

    Go to Tools > Internet Options > Security Click on Custom Level button and scroll down a bit and Disable Active scripting


    For Google Chrome Users:

    Click on Options > Under The Hood > Content Settings and click on the “JavaScript” tab