ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో భద్రపరుచుకునేందుకు డిజి లాకర్ సదుపాయాన్ని ఉచితంగా కేంద్ర సర్కారు అందుబాటులోకి తెచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులు సర్టిఫికెట్లను వెంట తీసుకువెళ్లే అవసరం లేకుండా, దీని ద్వారా ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ ప్రింట్ తీసుకుని వాడుకునే సౌలభ్యం ఉంది. ఆధార్ సంఖ్య ఉంటే చాలు డిజిటల్ లాకర్ తెరిచి, ప్రతి వ్యక్తి 10 ఎంబీ డేటాను భద్రపరుచుకునే వీలుంటుంది.
సాధారణంగా ఒక పత్రం 200 కేబీలోపే ఉంటుంది. ఈ లెక్కన 50 పత్రాల వరకు సురక్షితంగా దాచుకొవచ్చు. అయితే డిజిటల్ సాంకేతికతను సామాన్యులు త్వరగా వినియోగించకోలేరన్న వాదనలు వినిపిస్తున్నా.. ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా వాడకం పెరగడాన్ని బట్టి చూస్తే ఈ అభిప్రాయం తప్పని తెలుస్తున్నది.
సాధారణంగా ఒక పత్రం 200 కేబీలోపే ఉంటుంది. ఈ లెక్కన 50 పత్రాల వరకు సురక్షితంగా దాచుకొవచ్చు. అయితే డిజిటల్ సాంకేతికతను సామాన్యులు త్వరగా వినియోగించకోలేరన్న వాదనలు వినిపిస్తున్నా.. ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా వాడకం పెరగడాన్ని బట్టి చూస్తే ఈ అభిప్రాయం తప్పని తెలుస్తున్నది.
డిజి లాకర్ సదుపాయాన్ని గుర్తిస్తే అక్షరజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ ఖాతాలను తెరిచేందుకు ముందుకు వస్తారనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి తెస్తున్నందున డిజి లాకర్‌కు మంచి స్పందన లభించే అవకాశం ఉంది. ఈ డిజిటల్ సేవ పూర్తిగా ఉచితం. విద్యార్హత, నివాస ధ్రువపత్రాలు డైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, వ్యక్తిగత పత్రాలతోపాటు రేషన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆదాయ పన్ను ఖాతా, పాన్ కార్డు నంబర్, వంటి కీలక పత్రాలన్నింటినీ డిజి లాకర్‌లో దాచుకోవచ్చు. ఈ పత్రాలన్నీ క్లౌడ్ పద్ధతిలో సురక్షితంగా ఉంటాయి. ఆయా డిజిటల్ పత్రాలను ప్రభుత్వం పరిశీలించి ఆమోదిస్తుంది. కనుక ఎక్కడైనా ముద్రించి తీసి ఇవ్వవచ్చు. మనం వెళ్లే ప్రాంతానికి ఇక పత్రాలన్నీ మోసుకెళ్లాల్సినా పని ఉండదు.
డిజి లాకర్ ఇలా తెరవవచ్చు
- ఎవరైనా డిజిటల్ లాకర్‌లో నమోదు చేసుకోవాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ నమోదు సమయంలో వారిచ్చిన సెల్‌ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉండాలి.
- అవి తెలిసిన వారు digilocker.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి సైన్‌ఆప్ క్లిక్ చేయాలి.
- మీరు సైన్‌ఆప్ క్లిక్ చేయగానే మిమ్మల్ని సెల్ నంబర్ అడుగుతుంది. ఆ సెల్ నంబర్ ఎంటర్ చేయగానే ఆ నంబర్ కు ఓటీపీ కోడ్ వస్తుంది. అలాగే మెయిల్ కి కూడా ఓ సందేశం వస్తుంది.
- ఆ నంబర్ కింద ఓ డబ్బాలాంటి బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో మీకు వచ్చిన సందేశాన్నినమోదు చేయాలి.
- అప్పుడు యూసర్ నేమ్, పాస్‌వర్డ్ అడుగుతోంది. వెంటనే వాటిని భర్తీ చేయాగానే ఆధార్ నెంబర్ అడుగుతుంది.
- ఆధార్ సంఖ్య నమోదు చేసిన తర్వాత సంబంధిత నెట్‌లోకి ప్రవేశించవచ్చు. అక్కడ మీకు సంబంధించిన అన్ని ముఖ్యమైన పత్రాలను దాచుకోవచ్చు.
- మీరు అప్ లోడ్ చేసే ప్రతి పత్రానికి ఓటీపీ కోడ్ వస్తుంది. దీంతో సురక్షితంగా ఈ పత్రాలను ఇతరులకు పంపవచ్చు.
- ఇక్కడ పత్రం సైజ్ కి లిమిట్ ఉంటుంది. ఒక్కో పత్రం 10 ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ అది తీసుకోదు. ఒక్కో ఖాతాకు 1 జిబి వరకు స్పేస్ ఉంటుంది.
- ఈ డిజిటల్ లాకర్ కి పాస్ వర్డ్ ఉంటుంది కాబట్టి మీ పత్రాలన్నీ సేఫ్ గా ఉంటాయి. మీరునేరుగా నెట్ నుంచే మీరు అనుకున్న చోటుకు పంపవచ్చు. ఆధార్‌లో నమోదైన వివరాలనే డిజిటల్ లాకర్ వ్యక్తిగత వివరాలుగా తీసుకుంటుంది కాబట్టి ఎటువంటి మోసాలు ఇక్కడ ఉండవు.
- ఇందులో పత్రాలు భద్రపర్చుకోవడంతో పాటు ఈ-సైన్ కు అవకాశం ఉంది. ఈ-సైన్‌పై క్లిక్ చేస్తే ధ్రువపత్రంపై మన సంతకం చేసినట్లు తెలుపుతుంది. నెట్‌లో దరఖాస్తులు కోరేవారికి దీని ద్వారా సులభంగా పంపవచ్చు. ఆధార్‌తో అనుసంధానం ఉంటుంది కాబట్టి మీసేవలో మీరు పొందిన ధ్రువపత్రాలు ఆటోమేటిక్‌గా డీజీలాకర్‌లోని మన ఖాతాలోకి వచ్చేస్తాయి.
- మీ వివరాలను నేరుగా కంపెనీమెయిల్ కి కాని లేకుంటే మీ ప్రెండ్స్ కి కాని షేర్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.
నమోదు చేసుకోండి
ప్రయోజనాలు ఇవీ
భద్రపరుచుకోదగిన పత్రాలు
- విద్యార్హత ధ్రువపత్రాలు, బీమా పాలసీలు బాండ్లు, ప్రభుత్వం జారీ చేసిన విలువైన అన్ని గుర్తింపు కార్డులు, విద్యుత్ , నీరు. టెలిఫోన్, ఆస్తి పన్ను రశీదులు వంటివి భద్రపరుచుకోవచ్చు.
అశోక్ చేలిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి