ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, డిసెంబర్ 2018, మంగళవారం

PaytmApp లో అదనపు చార్జీ లేకుండా రైలు టికెట్ బుకింగ్ చేసుకొనే విధానం


Paytm మొబైల్ వాలెట్ నుంచి ఇక ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా రైలు టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు.
పేమెంట్ గేట్‌వే, సర్వీస్ చార్జీలను కూడా పేటీఎం రద్దు చేయడం విశేషం. యూజర్లు తమ పీఎన్‌ఆర్ స్టేటస్‌ను చూసుకోవడంతోపాటు టికెట్‌ను రద్దు చేసుకుంటే వెంటనే రీఫండ్ కోరే అవకాశం కల్పించింది.
ఐఆర్‌సీటీసీతో ఈ మధ్యే మరో మొబైల్ వాలెట్ ఫోన్‌పె ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో పేటీఎం తమ యూజర్లకు ఈ ఆఫర్ ఇస్తున్నది.
ఇప్పటివరకు పేటీఎం మొత్తం రైలు టికెట్ చార్జీలో పేమెంట్ గేట్‌వే ఫీజు కింద 1.8 శాతం వసూలు చేస్తున్నది. దీనికితోడు అదనపు చార్జీలు కూడా ఉండేవి.
వీటన్నింటినీ రద్దు చేసినట్లు పేటీఎం వైస్‌ప్రెసిడెంట్ అభిషేక్ రాజన్ చెప్పారు.

ట్రైన్ టికెట్  చేసుకునే విధానం 
Step 1
పేటీఎం యాప్ లోకి లాగిన్ అయి Train tickets ఆప్షన్ పై క్లిక్ చేయాలి

Step 2
Book Ticket ఆప్షన్ పై క్లిక్ చేయాలి.. ట్రైన్ ఎక్కవలసిన స్టేషన్ మరియు దిగవలసిన స్టేషను సెలెక్ట్ చేసుకుని ఏ రోజు వెళ్లాలో ఆ రోజును సెలెక్ట్ చేసుకుని సెర్చ్ ట్రైన్ ఆప్షన్ పై click చేయాలి.
Step 3
కావాల్సిన ట్రైన్ సెలెక్ట్ చేసుకుని అలాగే రిజర్వేషన్ టైప్ ను సెలెక్ట్ చేసుకుని సీటు సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయాలి..

ట్రైన్ PNR Status check చేయడం ఎలా ?

Step 1
పేటీఎం యాప్ లోకి లాగిన్ అయి Train tickets ఆప్షన్ పై క్లిక్ చేయాలి..

Step 2
PNR status  ఆప్షన్ పై క్లిక్ చేయాలి.. 

Step 3
PNR Number ఎంట్రీ చేసి PNR యొక్క status ను తెలుసుకోవచ్చు...

Train status తెలుసుకోవడం ఎలా ?

Step 1
పేటీఎం యాప్ లోకి లాగిన్ అయి Train tickets ఆప్షన్ పై క్లిక్ చేయాలి..

Step 2
Train status పై క్లిక్ చేయాలి...
Step 3
Train number ఎంట్రీ చేసి ట్రైన్ యొక్క లైవ్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు....



థాంక్యూ,
మీ
అశోక్ చెలిక.




20, డిసెంబర్ 2018, గురువారం

మీ ఆధార్ కార్డు పోయిందా ? ఆర్డర్ ఆధార్ రీప్రింట్ ద్వార కొత్త ఆధార్ మీ ఇంటికి ఇండియన్ పోస్ట్ ద్వార వస్తుంది.(కేవలం 50రూపాయలలో)

చాల మంది తమ యొక్క ఆధార్ కార్డు ను వివిధ కారణాలతో పొగొట్టుకుంటున్నారు....మరియు వారికీ తమ అదార్ కు మొబైల్ నెంబర్ కూడా లింక్ అయ్యి ఉండటం లేదు.....


ఈ లాంటి సందర్భంలో ఆర్డర్ ఆధార్ రీప్రింట్ ద్వార అదార్ కార్డు ను పోస్ట్ ద్వార ఒరిజినల్ ఏ విధంగా పొందాలంటే ...

స్టెప్ 1
అధార్ వెబ్ సైట్   లోకి వెళ్లి Aadhaar Services  లో Order Aadhaar Reprint (Pilot Basis) అనే ఆప్షన్ను ఎంచుకోవాలి.

స్టెప్ 2
  ఆధార్ లేదా VID నెంబర్ ఎంటర్ చేసి captcha code ఎంటర్ చేయాలి.ఒకవేళ మీ ఆధార్ కు మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి లేకపోతె If you do not have a registered mobile number, please check in the box.  అనే చెక్ బాక్స్ tick చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
ఆ తరువాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ కు OTP వస్తుంది.దానిని Enter OTP బాక్స్ లో టైపు చేసి  Terms & Conditions అనే చెక్ బాక్స్ ను  tick చేసి సబ్మిట్ చేయాలి.


స్టెప్ 3

aadhaar preview చూసుకొని Make Payment  పై క్లిక్ చేయాలి.
స్టెప్ 4
తరువాత స్టేటస్ ను చెక్ చేయడానికి  Check Reprint Status అనే లింక్ పై క్లిక్ చేసి SRN నెంబర్ మరియు ఆధార్ నెంబర్  ఎంటర్ చేసి  captcha code టైపు చేసి సబ్మిట్ పై క్లిక్ చేసి మనం అప్లై చేసిన Order Aadhaar Reprint (Pilot Basis) యొక్క  స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.









ధన్యవాదాలు,
మీ 
అశోక్ చెలిక.

గూగుల్ డ్రైవ్‌లో వస్తున్న సరికొత్త ఫీచర్..!

GOOGLE DRIVE కోసం చిత్ర ఫలితం
Google Drive



సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన డ్రైవ్ అప్లికేషన్‌ను వాడుతున్న యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది.ఇకపై గూగుల్ అకౌంట్ లేని యూజర్లు కూడా డ్రైవ్‌లో షేర్ చేయబడిన డాక్యుమెంట్లను రియల్‌టైంలో ఎడిట్ చేసుకోవచ్చు. అందుకు గాను డ్రైవ్ ఖాతా ఉన్న యూజర్ ఇతర యూజర్‌కు పిన్‌ను షేర్ చేయాలి. దాన్ని ఎంటర్ చేస్తే గూగుల్ అకౌంట్ లేని ఇతర యూజర్లు కూడా డ్రైవ్‌లో ఉన్న డాక్యుమెంట్లను గూగుల్ డాక్స్‌లో ఎడిట్ చేసుకోవచ్చు.
డాక్యుమెంట్లు, షీట్లు, స్లయిడ్లు తదితర ఫైల్స్‌ను ఇలా ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం డ్రైవ్‌ను వాడుతున్న బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలో పూర్తి స్థాయిలో దీన్ని డ్రైవ్ యూజర్లకు అందుబాటులోకి తేనున్నారు.

18, మే 2018, శుక్రవారం

ఫోటోల్ని ఒకే పేజీలో ప్రింట్ తీసుకోవటం ఏలా..?

 



స్టెప్ 1
  కావల్సిన ఫోటోలను  సెలక్ట్ చేసుకున్న ఫోటోల పై రైట్ క్లిక్ చేసి  ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
 

ఇప్పుడు ప్రింట్ మోనూ ఓపెన్ అవుతుంది. ప్రింటర్, పేపేర్ సైజ్, క్వాలిటీ అనే ఆప్షన్‌లు కనిపిస్తాయి. ప్రింటర్ కాలమ్‌లో మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ అయి ఉన్న ప్రింటర్‌ను సెలక్ట్ చేుసుకోవల్సి ఉంటుంది. అలానే, పేపర్ సైజ్ మెనూలో మీకు నచ్చిన పేపర్ సైజ్‌ను సెట్ చేసుకోవచ్చు.

ప్రింట్ మెనూ కుడి వైపు భాగంలో స్లైడర్ మాదిరి లేవట్ బార్ మీకు కనిపిస్తుంది. ఈ లేఅవుట్ స్లైడర్‌లో వివిధ సైజులతో కూడిన ప్రివ్యూలను మీరు చూడొచ్చు.. ఒక పేజీలో ఒక పోటోనే కావాలా, లేకు రెండు ఫోటోలు కావాలా లేకుంటే 4 లేదా 9 ఫోటోలు కావాలా ఇలా రకరకాల ప్రివ్యూ ఆప్షన్‌లు మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన ప్రివ్యూను సెట్ చేసుకుని ప్రింట్బ టన్ పై క్లిక్ చేసినట్లయితే ఒకే పేజీలో మీరు ఎంపిక చేసుకున్న ఫోటోలను ప్రింట్ రూపంలో పొందవచ్చు.



ధన్యవాదాలు,
అశోక్ చెలిక