ఈ బ్లాగును సెర్చ్ చేయండి

20, డిసెంబర్ 2018, గురువారం

గూగుల్ డ్రైవ్‌లో వస్తున్న సరికొత్త ఫీచర్..!

GOOGLE DRIVE కోసం చిత్ర ఫలితం
Google Drive



సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన డ్రైవ్ అప్లికేషన్‌ను వాడుతున్న యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది.ఇకపై గూగుల్ అకౌంట్ లేని యూజర్లు కూడా డ్రైవ్‌లో షేర్ చేయబడిన డాక్యుమెంట్లను రియల్‌టైంలో ఎడిట్ చేసుకోవచ్చు. అందుకు గాను డ్రైవ్ ఖాతా ఉన్న యూజర్ ఇతర యూజర్‌కు పిన్‌ను షేర్ చేయాలి. దాన్ని ఎంటర్ చేస్తే గూగుల్ అకౌంట్ లేని ఇతర యూజర్లు కూడా డ్రైవ్‌లో ఉన్న డాక్యుమెంట్లను గూగుల్ డాక్స్‌లో ఎడిట్ చేసుకోవచ్చు.
డాక్యుమెంట్లు, షీట్లు, స్లయిడ్లు తదితర ఫైల్స్‌ను ఇలా ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం డ్రైవ్‌ను వాడుతున్న బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలో పూర్తి స్థాయిలో దీన్ని డ్రైవ్ యూజర్లకు అందుబాటులోకి తేనున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి