ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, జులై 2015, మంగళవారం

ఫేస్బుక్ లైట్ వెర్షన్ వచ్చింది

 

 


  తక్కువ వేగం కలిగిన మొబైల్ నేట్ ని వాడే వినియోగదారులకి కూడా ఫేస్‌బుక్ వేగంగా తెరుచుకోబోతుంది. దానికోసం ఫేస్‌బుక్ లైట్ అనే అప్లికేషనుని విడుదలచేసింది. 
 ఇప్పటికి ఎక్కువగా వాడబడుతున్న 2జి నెట్‌వర్క్‌ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ ఫేస్‌బుక్ లైట్ అప్లికేషను సైజు యంబి కన్నా తక్కువ వుండటం వలన చాల త్వరగా ఇన్స్టాల్ అవుతుంది, తక్కువ మెమరీ ని ఆక్రమిస్తుంది. అంతేకాకుండా తక్కువ ఫోను వనరులని వాడుకుంటూ (ప్రాససర్, రామ్‌ మరియు బ్యాటరీ) దిగువ శ్రేణి మొబైళ్ళలో కూడా పనిచేసేలా దీనిని రూపొందించారు. మొబైల్ నెట్ వర్క్‌ల వాడేవారికి వేగంగా ఫేస్‌బుక్‌ను చూపించడమే కాకుండా డాటా తక్కువగా వాడుకుంటు సమయాన్ని, డబ్బులని ఆధా చేస్తుంది. ఆప్షన్ల విషయంలో సాధారణ వెర్షను ఫేస్‌బుక్ యాప్‌తో పోల్చలేనప్పటికి కనీస అవసరాలయిన అన్ని ఆప్షన్లు దీనిలో కూడా ఉందుబాటులో ఉన్నాయి.


ఆండ్రాయిడ్ కోసం : డౌన్‌లోడ్

విండోస్ కోసం : డౌన్‌లోడ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి