ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, మే 2018, ఆదివారం

ఇంటి నుండే మీ మొబైల్ సిమ్ కార్డును -ఆధార్ తో లింక్ చేసుకోండి


మీరు ఏ నెట్‌వర్క్ వాడుతున్నా ఒకే నెంబర్‌కు ఫోన్ చేసి ఆధార్‌ను లింక్ చేయొచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం..

☀ మీ వెరిఫై చేసుకోవాల్సిన మొబైల్ నంబర్ నుంచి 14546కు కాల్ చేయాలి. అప్పుడు మీరు భారత పౌరుడా లేదా ఎన్ఆర్ఐ కస్టమరా అని అడుగుతుంది. మీరు ఒక ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత 1ని ప్రెస్ చేసి మీ ఆధార్ నంబర్‌ను పొందుపరచాలి.
☀ ఆధార్ నంబర్‌ను ఖరారు చేసుకోవడానికి మరొకసారి 1ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్‌కి ఒక వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఇప్పుడు మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
☀ యూఐడీఏఐ డాటా బేస్ నుంచి మీ పేరు, ఫొటో, పుట్టినతేదీని మీ ఆపరేటర్ తీసుకోవడం మీకు సమ్మతమేనా అని ఇక్కడ అడుగుతుంది.
☀ ఆ తరవాత మీ మొబైల్ నంబర్ చివరి నాలుగు అంకెలను ఎంటర్ చేసి ధ్రువీకరించుకోవాలి. ఇప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా మీకు మరో ఓటీపీ వస్తుంది.

☀ చివరిగా ఆధార్-మొబైల్ నంబర్ రీ-వెరిఫికేషన్‌ను పూర్తిచేయడానికి 1ని ప్రెస్ చేయాలి.
☀ ఒకవేళ మీకు ఇంకో ఫోన్ నంబర్ ఉంటే 2ని ప్రెస్ చేసి మళ్లీ పైన పేర్కొన్న విధానం ద్వారానే దానికి కూడా ఆధార్‌ను లింక్ చేసుకోవాలి. ఈ సమయంలో మీ రెండో ఫోన్ నంబర్ కూడా ఆన్‌లో ఉండాలి. ఎందుకంటే దానికి కూడా ఓటీపీ వస్తుంది.

మీ మొబైల్ నంబర్‌‌కు వచ్చిన ఓటీపీ 30 నిమిషాల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఈ లోపలే ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే ఈ ప్రక్రియను ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ యాక్టివేట్ చేశాయి. బీఎస్‌ఎన్‌ఎల్, జియో సంస్థలు యాక్టివేట్ చేయాల్సి ఉంది.

ధన్యవాదాలు
మీ అశోక్ చేలిక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి