ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, జూన్ 2015, శుక్రవారం

ఫ్రీ ఫేస్బుక్ చాటింగ్ అన్ని ఫోన్ లలో మరియు అన్ని సిమ్ లలో పనిచేస్తుంది



ఫ్రీ ఫేస్బుక్ చాటింగ్  కావాలా అయితే ఇలా ట్రై చేయండి 







    • ఫ్రీ ఫేస్బుక్ చాట్టింగ్ చేయడానికి    మీ మొబైల్ నుండి *325*33*99#  ను డయల్ చేయండి

    • ఫ్రీ ఫేస్బుక్ పోస్ట్ అప్డేట్  చేయడానికి     మీ మొబైల్ నుండి *325*75#  ను డయల్ చేయండి

       బేసిక్ ఫోన్ లు వాడేవారికి చాల ఉపయోగపడుతుంది 

      మీరు ఒక్కసారి ప్రయత్నించండి 

       

       

       

      థాంక్స్ 

      మీ 

      అశోక్ చేలిక

     

     

     

     

     

     

     

epf బాలన్సు ను ప్రతి నెల మెసేజ్ రూపంలో మీ చరావని కి పొందండి ఇలా ?

epf బాలన్సు ను ప్రతి నెల మెసేజ్ రూపంలో మీ చరావని కి పొందండి ఇలా ?

EPFO Short Code SMS Service - EPF account balance as sms


epf బాలన్సు ను మెసేజ్ రూపంలో పొందడానికి మీ uan రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నుండి
ఒక మెసేజ్ ఈ క్రింది విదంగా టైపు చేయండి

 EPFOHO UAN <LAN> send to  77382 99899


ఉదాహరణకు EPFOHO UAN ENG అని టైపు చేసి  77382 99899 అనే నెంబర్ కు మెసేజ్ ను పంపండి

మరిన్నివివరలుకు epf ఇండియా టోల్ ఫ్రీ నెంబర్ 180011800 ను సంప్రదించండి

24, జూన్ 2015, బుధవారం

ఆన్లైన్ లో పాసుపోర్ట్ అప్లై చేసుకోండి ఇలా

ఆన్లైన్ లో పాసుపోర్ట్ అప్లై చేసుకోండి ఇలా 


 ఆన్‌లైన్‌లో దరఖాస్తు
దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు passport india website లో లాగిన్‌ కావాలి. అందులోని హోం పేజీలో యూజర్‌ రిజిస్ట్రేషన్‌ వద్ద క్లిక్‌ చేసి అడిగిన సమాచారాన్ని నింపి సబ్మిట్‌ చేయాలి. కొత్తగా వచ్చే యూజర్‌ ఐడీతో కొత్త, రెన్యువల్‌ పాసుపోర్టుల్లో ఏదీ కావాలనుకుంటే ఆ దరఖాస్తును నింపాలి. అదే సమయంలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డు, ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకుల ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లేదా ఎస్‌బీఐ చలానా ద్వారా ఫీజు చెల్లించి అందుబాటులో ఉన్న తేదీల్లో అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి. తర్వాత పరిశీలనకు తాము ఎంచుకున్న పాసుపోర్టు సేవా కేంద్రం వద్దకు ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, ఆన్‌లైన్‌ ఫారం సమర్పించేప్పుడు ప్రింట్‌ తీసిన రసీదుతో హాజరు కావాలి. పోలీసు పరిశీలన నివేదిక(పీవీఆర్‌) తర్వాత పోస్టులో పాసుపోర్టు అందుతుంది. సాధారణమైనదైతే దరఖాస్తు చేసిన నెల రోజుల్లోపే అందేందుకు వీలుంది. తత్కాల్‌ అయితే వారం రోజులలోపే జారీ చేస్తారు.
* సేవా కేంద్రాల్లోనే పరిశీలన
పాసుపోర్టుకు దరఖాస్తు చేసిన వారే సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒకరి తరఫున మరొకరు వెళ్లడానికి వీల్లేదు. దరఖాస్తుదారుడి వేలిముద్రలను తీసుకుంటారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించిన తర్వాత మీరు ఎంచుకున్న తేదీ, సమయంలో అసలు ధ్రువపత్రాలు, దరఖాస్తు సమర్పించిన తర్వాత వచ్చే రసీదు తీసుకొని హాజరుకావాలి.
హైదరాబాద్‌ ప్రాంతీయ, విశాఖపట్నం పాసుపోర్టు కేంద్రాలు కేవలం పాసుపోర్టులను ముద్రించడం, దరఖాస్తుదారులకు పంపించడం చేస్తాయి. దరఖాస్తుదారుల సమస్యలను పరిష్కరిస్తాయి. అక్కడ మాత్రం దరఖాస్తుదారుల ధ్రువపత్రాల పరిశీలన జరగదు. పరిశీలన సేవా కేంద్రాల్లోనే చేస్తారు.
విశాఖపట్నానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో చదువుకుంటుంటే విశాఖపట్నంలోనే తీసుకోవాలన్న నిబంధన లేదు. కళాశాల యాజమాన్యం ఇచ్చే అఫిడవిట్‌తో ఇక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. శాశ్వత చిరునామా వైజాగ్‌ కనుక అక్కడైనా తీసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం ఎక్కడ ఉంటుందనేది దరఖాస్తులో పేర్కొనాలి.
* దరఖాస్తుదారులకు సమస్య తలెత్తితే సికిందాబ్రాద్‌లోని ప్రాంతీయ పాసుపోర్టు కార్యాలయంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉ.9.30 గంటల నుంచి 11.30 మధ్యలో వచ్చి టోకెన్‌ తీసుకొని పరిష్కారం పొందవచ్చు.
* దరఖాస్తుల సమర్పణపై సందేహాలుంటే 17 భాషల్లో 24 గంటలపాటు పనిచేసే టోల్‌ ఫ్రీ నంబరు ఉంది. 18002581800     కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు.
* దరఖాస్తుదారులు హైదరాబాద్‌ పాసుపోర్టు కార్యాలయ అధికారులను 040-27704646, ఫ్యాక్స్‌ నంబరు: 040-27705656 లో సంప్రదించవచ్చు.
* సికింద్రాబాద్‌ కార్యాలయంలో సహాయక కేంద్రం(హెల్ప్‌ డెస్క్‌) ఉంది. అక్కడ దరఖాస్తులను నింపడం, లేఖలు రాయడం, వివిధ విభాగాలను సంప్రదించడానికి సహాయం చేస్తారు.
* స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు మొబైల్‌ యాప్‌ mpassport seva ద్వారా పాసుపోర్టులకు సంబంధించిన చాలా వరకు సమాచారం తెలుసుకోవచ్చు.
* దరఖాస్తు చేసుకున్న తర్వాత పాసుపోర్టు సేవా కేంద్రం(పీఎస్‌కే)ల్లో రూ.30లు అదనంగా చెల్లిస్తే దరఖాస్తు స్థితిపై ఎస్‌ఎంస్‌లు అందుకోవచ్చు. తొమ్మిది సార్లు ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. దరఖాస్తుదారు ఎస్‌ఎంఎస్‌ పంపి తమ దరఖాస్తు, పాసుపోర్టు స్థితిని తెలుసుకోవచ్చు. అందుకు 9704100100 నంబరుకు సంక్షిప్త సందేశం పంపించాలి. అందుకు status space file no. ను పంపించాలి. ఉదాహరణకు status hy106771561714 అని ఎస్‌ఎంఎస్‌ పంపితే సమాధానం వస్తుంది.
>> ఇవి మీకు తెలుసా..?
* పాసుపోర్టును పదేళ్ల వ్యవధికి ఇస్తారు. ఆ గడువు పూర్తయిన తర్వాత మళ్లీ పదేళ్ల కాలానికి రెన్యువల్‌ చేస్తారు.
* 18 సంవత్సరాల్లోపు వారిని మైనర్లుగా పరిగణిస్తారు. మైనర్లకు అయిదు సంవత్సరాల గడువు ఉన్నది ఇస్తారు.
* సాధారణ పాసుపోర్టు(నార్మల్‌) నీలం రంగు, డిప్లమాట్‌(జడ్జీలు, రాజ్యాంగ పదవుల్లో ఉండే సీఎం, ఎంపీలు తదితరులు) మెరూన్‌(రాణి రంగు), అఫీషియల్‌(అధికారిక పనులపై వెళ్లేవారికి) పాసుపోర్టు బూడిద రంగులో ఉంటుంది.

పాసు పోర్ట్ సాదారణ రుసుం

> తత్కాల్‌ (36 పేజీలు) రూ.3,000 ; 60 పేజీలు రూ.4,000
> దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌కు రూ.30
> సాధారణ పాసుపోర్టు (36 పేజీలు) రూ.1,500 ; 60 పేజీలు సాధారణం రూ.2,000

17, జూన్ 2015, బుధవారం

secret codes of android phones

secret codes of android phones


. *#06# – ఫోను IMEI నంబరు తెలుసుకోవడానికి
*#0*# –సాంసంగ్ ఫోన్‌లలో సర్వీస్ మెనూలోకి ప్రవేశించడానికి
*#*#4636#*#* – ఫోను గురించిన సమాచారం, ఫోను మరియు బ్యాటరీ వాడకం యొక్క గణాంకాలు
*#*#34971539#*#* – కెమేరా గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి
*#*#273282*255*663282*#*#* – అన్ని ఆడియో, వీడియో ఫైళ్ళు తక్షణం బ్యాకప్ తీసుకోవడానికి
*#*#232339#*#* – వైర్‌లెస్ లాన్ పరిక్షించడానికి
*#*#0842#*#* –బ్యాక్ లైట్ మరియు వైబ్రేషన్ పరిక్షించడానికి
*#*#2664#*#* –తాకేతెరను పరిక్షించడానికి
*#*#1111#*#* – FTA సాఫ్ట్వేర్ వెర్షను తెలుసుకోవడానికి
*#12580*369# –సాఫ్ట్వేౠ మరియు హార్డ్వేరు సమాచారం తెలుసుకోవడానికి
*#9900# – సిస్టం డంప్ మోడ్
*#301279# – HSDPA/HSUPA కంట్రోల్ మెనూ
*#7465625# – ఫోను లాక్ స్టేటస్ తెలుసుకోవడానికి
*#*#7780#*#* – డాటా పార్టిషియన్ని ఫ్యాక్టరీ స్థితికి తీసుకురావడానికి
*2767*3855# –ఫోన్ లో డాటాని పూర్తిగా చెరిపివేయడానికి
##7764726 –మోటోరోలా ఫోన్‌లలో రహస్య సర్వీస్ మెనూ చూడడానికి
*#*#232338#*#* –వైఫి మాక్ చిరునామాని తెలుసుకోవడానికి
*#*#1472365#*#* – GPSని పరిక్షించడానికి
*#*#1575#*#* – GPSని పరిక్షించడానికి
*#*#0283#*#* – పాకెట్ లూప్‌బ్యాక్ పరిక్ష చేయడానికి
*#*#0*#*#* – LCD డిస్‌ప్లే పరిక్షించడానికి
*#*#0289#*#* – ఆడియోని పరిక్షించడానికి
*#*#2663#*#* –సోన్‌ యొక్క తాకేతెర వెర్షను చూడడానికి
*#*#0588#*#* –ప్రాక్సిమిటీ సెన్సార్‌ని పరిక్షించడానికి
*#*#3264#*#* – RAM వెర్షను చూడడనికి
*#*#232331#*#* –బ్లూటూత్ ని పరిక్షించడానికి
*#*#232337#*# – బ్లూటూత్ పరికరం చిరునామాని తెలుసుకోవడానికి
*#*#7262626#*#* –ఫీల్డ్ టెస్ట్ చేయడానికి
*#*#8255#*#* –గూగుల్ టాక్ సేవలను పర్యవేక్షించడానికి
*#*#4986*2650468#*#* – ఫోను, హార్డ్వేర్, పిడిఎ, ఆర్‌యఫ్ కాల్‌ డాటా ఫిర్మ్‌వేర్ గురించిన సమాచారం తెలుసుకోవడానికి
*#*#1234#*#* – పిడిఎ మరియు ఫోను ఫిర్మ్‌వేర్ గురించిన సమాచారం తెలుసుకోవడానికి
*#*#2222#*#* –  FTA హార్డ్వేర్ వెర్షను తెలుసుకోవడానికి


గమనిక: వీటిలో కొన్ని కోడ్లు డాటా చెరిపివేయడం మరికొన్ని ఫోన్‌ పనిచేయకుండా చేస్తాయి కనుక కోడ్లు వాడే ముందు జాగ్రత్తగా చూసుకుని అవసరమైనవి మాత్రమే వాడుకోగలరు

థాంక్స్
మీ అశోక్ చేలిక.

ఆండ్రాయిడ్ కీబోర్డ్‌తో ఇప్పుడు తెలుగు కూడా టైప్ చేయవచ్చు

ఆండ్రాయిడ్ కీబోర్డ్‌తో ఇప్పుడు తెలుగు కూడా టైప్ చేయవచ్చు

      ఆండ్రాయిడ్ 4.2.2 తో తెలుగు అక్షరాలు చూడడానికి మద్దతును కల్పించిన గూగుల్ మొన్న విడుదలైన ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్‌లో తెలుగుభాషలో ఫోన్‌ని వాడుకోనే వెసులుబాటునుచేర్చడం జరిగింది. దానితో పాటు ఎటువంటి అధనపు కీబోర్డ్ యాప్ ఇన్‌స్టాల్ చేయనవసరం లేకుండానే ఆండ్రాయిడ్లో వచ్చే గూగుల్ కీబోర్డ్ తో తెలుగుటైప్ చేయడానికి కావససిన మద్దతును కూడా చేర్చారు. అయితే అధికారికంగా ఆండ్రాయిడ్ 5.0 విడుదలైనప్పటికి మనవరకు ఆ అప్‌డేట్ రావడానికి  ఇంకా సమయం పట్టవచ్చు. అయితే గూగుల్ నుండి అప్‌డేట్ వచ్చినప్పటికి తయారీదారులందరు వారి పరికరాలకు అప్‌డేట్‌ని విడుదల చేయకపోవచ్చు కూడా. అయినప్పటికి అన్ని ఆండ్రాయిడ్ పరికారాలు వాడేవారు కూడా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. తొందరలోనే రాబోతున్న గూగుల్ కీబోర్డ్ యాప్ అప్‌డేట్‌తో తెలుగుతో పాటు మరో 8 భారతీయ భాషలు టైప్ చేయవచ్చు. దానికి మనం గూగుల్ కీబోర్డ్ యాప్‌ 3.2 అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. అప్‌డేట్ రాకముందే ఇప్పుడే గూగుల్ కీబోర్డ్ యాప్‌ 3.2 ప్రయత్నించాలనుకుంటే ఇక్కడ నుండి ఎపికే ఫైల్‌ని దింపుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎపికే ఫైల్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలియకపోతే ఇక్కడ చూడండి. యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత క్రింది చిత్రాలలో వలే ఫోను సెట్టింగ్స్ – లాంగ్వేజి&ఇన్‌పుట్ సెట్టింగ్ – గూగుల్ కీబోర్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడనుండి తెలుగును ఎంచుకొని టైప్ చేసుకోవచ్చు.

14, జూన్ 2015, ఆదివారం

వైరస్ ల వల్ల ఫోల్డర్స్ హిడెన్ లోకి వెళితే...

ఈ మధ్య నా పెన్ డ్రైవ్ ను నెట్ సెంటర్ లో వాడాను. దానిని నా సిస్టమ్ కి తిరిగి కనెక్ట్ చేసి చూస్తే ఫోల్డర్స్ అన్నీ మాయ మయ్యి పోయి వాటి స్థానం లో ఏవో షార్ట్ కట్శ్ వున్నాయి..
పెన్ డ్రైవ్ లో ని వైరస్ ను నా యాంటీ వైరస్ క్లీన్ చేసింది కానీ దాయబడ్డ ఫోల్డర్స్ ను తిరిగి తెప్పించలేక పోయింది..
దీనికి నెట్ లో దొరికిన పరిష్కారం.
సెర్చ్ బార్ లో cmd అని టైప్ చేసి రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ అని సెలక్ట్ చేసి రన్ చెయ్యండి..
అప్పుడు  కమాండ్ ప్రాంప్ట్ లో క్రింది విధంగా టైప్ చెయ్యండి..
"attrib F:*.* /d /s -h -r -s "
 ఇక్కడ  F:స్థానం లో మీ పెన్ డ్రైవ్ యొక్క లెటర్ ను పరిక్షేపించండి..
దీనితో మీ సమస్య పూర్తిగా పరిష్కరించబడుతుంది..  ఇది చేసే ముందు మీ పెన్ డ్రైవ్ ను శక్తివనంతమైన యాంటీ వైరస్ తో స్కాన్ చెయ్యండి..

పర్సనల్ కంప్యూటర్ స్పీడ్‌గా పనిచేయడానికి టిప్స్

పర్సనల్ కంప్యూటర్ స్పీడ్‌గా పనిచేయడానికి టిప్స్ 

 

 
 
 పర్సనల్ కంప్యూటర్ చాలా నెమ్మదిగా పని చేస్తోందా? కారణం అవసరంగా పేరుకుపోయిన ఫైల్స్‌ కావచ్చు. మన కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టించే వైరస్‌లు కావచ్చు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ లేకపోవడం వల్ల కావచ్చు. ఈ నేపథ్యంలో 'పర్సనల్ కంప్యూటర్ వేగాన్ని పెంచే చిట్కాలు, సాఫ్ట్‌వేర్‌లు ఏమనేవి చూద్దాం... సీ,డీ,ఈ,ఎఫ్‌ డ్రైవ్‌లను ఎప్పటికప్పుడు క్లీన్‌, డీఫ్రాగ్మెంటేషన్‌ చేయడం ద్వారా పీసీ వేగాన్ని కొంతమేర పెంచొచ్చు. అందుకు MyComputer-> Drive-> Right Click-> Properties-> Tools-> Defragment Now క్లిక్‌ చేయాలి. టెంపరరీ ఫైల్స్‌ తీసేయాలంటే Start-> Runలోకి వెళ్లి %temp%, recent అని టైప్‌ చేసి ఓకే చేయండి. వచ్చిన విండోలోని టెంపరరీ ఫైల్స్‌ని డిలీట్‌ చేయండి. స్టార్ట్‌అప్‌లో అక్కర్లేని పొగ్రాంలను డిసేబుల్‌ చేయవచ్చు. అందుకు రన్‌లోకి వెళ్లి msconfig టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కండి. వచ్చిన విండోలోని 'స్టార్ట్‌అప్‌' ట్యాబ్‌లోకి వెళ్లి అక్కర్లేని ప్రొగ్రాంలను అన్‌చెక్‌ చేసి సిస్టంని రీస్టార్ట్‌ చేయండి. 'ట్యూన్‌అప్‌ యుటిలిటీస్‌' సాఫ్ట్‌వేర్‌లో సిస్టమ్ సామర్థాన్ని పెంచే సదుపాయాలు ఉన్నాయి. డెస్క్‌టాప్‌పై తక్కువ ఐకాన్లు ఉంచాలి. ఎక్కువ మెమొరీతో కూడిన ఫైల్స్‌ పెట్టడం మంచిది కాదు. CCleaner, Zappit System Cleaner, SS Disk Cleaner టూల్స్‌తో అనవసరమైన ఫైల్స్‌ని తొలగించవచ్చు. అక్కర్లేని సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలి. అందుకు సిస్టంలోనే Add/Remove సిద్ధంగా ఉంది. Start-> Settings-> Control Panel-> Add or Remove Programs క్లిక్‌ చేసి అక్కర్లేని వాటిని తొలగించాలి. యాంటీ వైరస్‌లను అప్‌డేట్‌ చేయాలి. టెంపరరీ ఫైల్స్‌ని మాన్యువల్‌గా తొలగించడం కష్టం అయితే Temp File Cleaner నిక్షిప్తం చేసుకోండి.

మీ కోసం జాబ్ సైట్లు

ఆధార్‌తో అనుసంధానం ఓటర్ కార్డులకు

ఆధార్‌తో అనుసంధానం బోగస్ ఓటర్ కార్డులకు చెక్!


జిల్లాల్లో అనేక మందికి రెండు చో ట్ల ఓటర్‌గుర్తింపు కార్డులు ఉన్నాయి. కానీ, వీరు ఒకే చోట మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంతో ఇటు ప్రభుత్వానికి, అటు ఎన్నికల సంఘానికి అసలైన ఓటర్లు ఎందరున్నారో అర్థం కాక తికమకపడుతున్నా రు. దీనిని నివారించేందుకు ప్రతి ఓటుహక్కు కలిగిన వా రి వివరాలు సేకరించి ఆధార్ సంఖ్యను ఓటుహక్కుతో జ తపరచడం వల్ల బోగస్ ఓటర్లను తొలగించవచ్చని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఇందులో భాగంగా ప్రతి జి ల్లాలోనూ ఓటర్‌కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతుంది. బీఎల్‌ఓల (బూత్ లెవల్ అధికారులు)తో ఇంటింటికి పంపించి ఓటర్ల ఆధార్ సంఖ్యలను సేకరిస్తున్నారు. అయితే జిల్లాలో ఈ ప్రక్రియ కాస్త మందకోడిగా సాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పది నియోజకవర్గాల్లోని ఓటర్లలో కేవలం 20.52 శాతం మంది మాత్రమే ఓటర్‌కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నారు.
అయితే మరో 75 శాతం ఓటర్ల ఆ ధార్‌కార్డుల వివరాలు జిల్లాలోని బూత్‌లెవల్ అధికారుల వద్ద సిద్ధంగా ఉన్నాయని అధికారులంటున్నారు. జిల్లాలో పది నియోజకవర్గాలకు కలిపి మొత్తం 19,71,207 మం ది ఓటర్లున్నారు. వీరిలో 4,04,436 మంది ఆధార్‌కార్డు లు మాత్రమే అనుసంధానమయ్యాయి. ఓటుహక్కు గురించి కచ్చితమైన సమాచారం ఒకరికి ఒకే ఓటుహక్కు ని నాదంతో బీఎల్‌పీఓలతో పాటు ఆన్‌లైన్, సెల్‌ఫోన్ మెస్సెజ్‌ల ద్వారా కూడా ఆధార్ అనుసంధాన ప్రక్రియను నిర్వహిస్తున్నారు. కేవలం ఒక ఓటర్ గుర్తింపుకార్డుకు మాత్ర మే ఆధార్‌కార్డు పనిచేస్తుంది.
మరో చోట ఉన్న ఓటర్ గు ర్తింపు కార్డుకు అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తే, ఇ ప్పటికే ఆధార్ నంబర్ జత చేశారని చెప్పేస్తుంది. ఈ క్ర మంలో ఆధార్‌ను అనుసంధానం చేసుకోని ఓటర్ గుర్తిం పు కార్డు రద్దవుతుంది. దీంతో అసలైన ఓటర్లు మాత్రమే మిగిలే అవకాశముంది. ఓటర్‌కార్డుతో ఆధార్ అనుసంధా నం ఈనెల 31లోగా పూర్తిచేసుకోవాలని ఎన్నికల సం ఘం సందేశాలు వస్తున్నాయి. ప్రచారం లేకపోవడంతో చాలా మంది ఓటుహక్కును కోల్పోయే అవకాశముంది



With the integration of Aadhaar cards to check bogus voter!

పలువిధాలుగా..


ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ కు ఎన్నికల సంఘం పలు విధానాలు రూపొందించింది. బూత్ స్థాయి అధికారులు(బీఎల్‌ఓ) ఇప్పిటికే ఓటర్ జాబితాల్లో ఆధార్ నంబర్లను సేకరిస్తున్నారు. వాటిని ఆన్‌లైన్ కి ఎక్కిస్తారు. ఈ మేరకు ఆయా మండలాల తహసీల్దార్లు బీఎల్‌ఓలకు శిక్షణ ఇచ్చారు. దీంతో పాటు ఆన్‌లైన్‌లో వె బ్‌సైట్, ఆండ్రాయిడ్ సెల్‌తో అప్లికేషన్, సంక్షిప్త సందేశం, నేరుగా కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి ఇలా నాలుగు రకాలుగా ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. అవెలాగంటే..

ఒక్క మెసేజ్‌తో..


సాధారణ సెల్‌ఫోన్‌తోనూ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. అందుకు ప్రత్యేక నంబర్‌ను అం దుబాటులోకి తెచ్చింది తెలంగాణ ఎన్నికల సంఘం. SEEDEPIC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్య తర్వాత మరో స్పేస్ ఇచ్చి ఆధార్ నంబర్‌ను నమోదు చేసి 8790499899 నంబర్‌కు ఎస్సెమ్మెస్ పం పితే సరిపోతుంది. నంబర్లు సరిగా ఉంటే మీ ఓటు సంఖ్య ఆధార్‌తో అనుసంధానం అయిందని రిైప్లెవస్తుంది. ఇప్పటికే సెల్ వినియోగదారులందరికీ ఈ విషయం సంక్షిప్త సందేశం ద్వారా పంపించింది ఎన్నికల సంఘం.

ఇంటర్‌నెట్‌లో..


తెలంగాణ ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ceotelanga na.nic.inలో ఆధార్ సిడీంగ్‌ను నొక్కాలి. అక్కడ వ న్ టైం పాస్ వర్డుతో అనుసంధానం అవుతుంది. ముందుగా ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్య, ఆపై ఆదార్ సంఖ్య నమోదు చేసి సెల్‌నెంబర్ ఇవ్వాలి. ఆతర్వాత ఓటీపీ వస్తుంది. పాస్‌వర్డ్ నమోదు అనంతరం ఓవైపు ఆధార్ కార్డు మరోవైపు ఓటర్ కార్డు వివరాలు తెరపై ప్రత్యక్షమవుతాయి. వాటిని అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది.

ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా..


ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ సాఫ్ట్‌వేర్ ఉన్న సెల్‌ఫోన్‌లో ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్(యాప్)ను వినియోగించుకుని ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక. ఇంటర్‌నెట్‌లో మా దిరిగానే ఓటర్ గుర్తింపుకార్డు, ఆధార్ సంఖ్యలు ఇచ్చి అ నుసంధానం చేస్తే సరిపోతుంది.

కాల్‌సెంటర్ ద్వారా..


నేరుగా కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి ఆధార్‌ను అనుసంధా నం చేసుకోవచ్చు. 1950 నంబర్‌కు ఫోన్ చేస్తే కాల్‌సెంటర్ ప్రతినిధి మాట్లాడతారు. ఆ తర్వాత ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్య, ఆధార్ సంఖ్యను చెబితే అప్పటికపుడు న మోదు చేస్తారు. ఇది కూడా సులభ ప్రక్రియ

ఆధార్ కార్డు తో ఓటర్ ఐ.డి. లింక్ చేయడం

ఆధార్ కార్డు తో ఓటర్ ఐ.డి. లింక్ చేయడం

తెలంగాణా రాష్ట్రంలో అనేక మందికి రెండుచోట్ల ఓటర్‌గుర్తింపు కార్డులు ఉన్నాయి. కానీ, వీరు ఒకే చోట మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంతో ఇటు ప్రభుత్వానికి, అటు ఎన్నికల సంఘానికి అసలైన ఓటర్లు ఎందరున్నారో అర్థం కాక తికమకపడుతున్నారు. దీనిని నివారించేందుకు ప్రతి ఓటుహక్కు కలిగిన వారి వివరాలు సేకరించి ఆధార్ సంఖ్యను ఓటుహక్కుతో జతపరచడం వల్ల బోగస్ ఓటర్లను తొలగించవచ్చని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఇందులో భాగంగా ప్రతి జిల్లాలోనూ ఓటర్‌కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతుంది. బీ.ఎల్‌.ఓ.ల (బూత్ లెవల్ అధికారులు) తో ఇంటింటికి పంపించి ఓటర్ల ఆధార్ సంఖ్యలను సేకరిస్తున్నారు. ఇంతవరకు వివిధ నియోజకవర్గాల్లోని ఓటర్లలో కేవలం 20.52 శాతం మంది మాత్రమే ఓటర్‌కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నారు.
అయితే మరో 75 శాతం ఓటర్ల ఆధార్‌కార్డుల వివరాలు జిల్లాలలోని బూత్‌లెవల్ అధికారుల వద్ద సిద్ధంగా ఉన్నాయని అధికారులంటున్నారు. హైదరాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలకు కలిపి మొత్తం 19,71,207 మంది ఓటర్లున్నారు. వీరిలో 4,04,436 మంది ఆధార్‌కార్డులు మాత్రమే అనుసంధానమయ్యాయి. ఓటుహక్కు గురించి కచ్చితమైన సమాచారం ఒకరికి ఒకే ఓటుహక్కుని నాదంతో బీ.ఎల్‌.పీ.ఓ. లతో పాటు ఆన్‌లైన్, సెల్‌ఫోన్ మెస్సెజ్‌ల ద్వారా కూడా ఆధార్ అనుసంధాన ప్రక్రియను నిర్వహిస్తున్నారు. కేవలం ఒక ఓటర్ గుర్తింపుకార్డుకు మాత్రమే ఆధార్‌కార్డు పనిచేస్తుంది.
మరో చోట ఉన్న ఓటర్ గుర్తింపు కార్డుకు అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తే, ఇప్పటికే ఆధార్ నంబర్ జత చేశారని చెప్పేస్తుంది. ఈ క్రమంలో ఆధార్‌ను అనుసంధానం చేసుకోని ఓటర్ గుర్తింపు కార్డు రద్దవుతుంది. దీంతో అసలైన ఓటర్లు మాత్రమే మిగిలే అవకాశముంది. ఓటర్‌కార్డుతో ఆధార్ అనుసంధానం ఈనెల 31లోగా పూర్తిచేసుకోవాలని ఎన్నికల సంఘం సందేశాలు వస్తున్నాయి. ప్రచారం లేకపోవడంతో చాలా మంది ఓటుహక్కును కోల్పోయే అవకాశముంది.

ఆధార్ కార్డు ని ఓటర్ కార్డు తో లింక్ చేయుటకు అందుబాటులో ఉన్న పలువిధాలు..

ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియకు ఎన్నికల సంఘం పలు విధానాలు రూపొందించింది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇప్పిటికే ఓటర్ జాబితాల్లో ఆధార్ నంబర్లను సేకరిస్తున్నారు. వాటిని ఆన్‌లైన్ కి ఎక్కిస్తారు. ఈ మేరకు ఆయా మండలాల తహసీల్దార్లు బీఎల్‌ఓలకు శిక్షణ ఇచ్చారు. దీంతో పాటు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్, ఆండ్రాయిడ్ సెల్‌తో అప్లికేషన్, సంక్షిప్త సందేశం, నేరుగా కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి ఇలా నాలుగు రకాలుగా ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. అవెలాగంటే..
మెసేజ్‌ (ఎస్.ఎం.ఎస్.) తో..
సాధారణ సెల్‌ఫోన్‌తోనూ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. అందుకు ప్రత్యేక నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ ఎన్నికల సంఘం. SEEDEPIC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్య తర్వాత మరో స్పేస్ ఇచ్చి ఆధార్ నంబర్‌ను నమోదు చేసి 8790499899 నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపితే సరిపోతుంది. నంబర్లు సరిగా ఉంటే మీ ఓటు సంఖ్య ఆధార్‌తో అనుసంధానం అయిందని రిైప్లెవస్తుంది. ఇప్పటికే సెల్ వినియోగదారులందరికీ ఈ విషయం సంక్షిప్త సందేశం ద్వారా పంపించింది ఎన్నికల సంఘం.
ఇంటర్‌నెట్‌లో..
తెలంగాణ ఎన్నికల సంఘం వెబ్‌సైట్ www.ceotelangana.nic.in లో ఆధార్ సిడీంగ్‌ను నొక్కాలి. అక్కడ వన్ టైం పాస్ వర్డుతో అనుసంధానం అవుతుంది. ముందుగా ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్య, ఆపై ఆదార్ సంఖ్య నమోదు చేసి సెల్‌నెంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్) వస్తుంది. పాస్‌వర్డ్ నమోదు అనంతరం ఓవైపు ఆధార్ కార్డు మరోవైపు ఓటర్ కార్డు వివరాలు తెరపై ప్రత్యక్షమవుతాయి. వాటిని అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది.
ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా..
ఆండ్రాయిడ్ లేదా ఐ.ఓ.ఎస్. సాఫ్ట్‌వేర్ ఉన్న సెల్‌ఫోన్‌లో ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ (యాప్) ను వినియోగించుకుని ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక. ఇంటర్‌నెట్‌లో మాదిరిగానే ఓటర్ గుర్తింపుకార్డు, ఆధార్ సంఖ్యలు ఇచ్చి అనుసంధానం చేస్తే సరిపోతుంది.
కాల్‌సెంటర్ ద్వారా..
నేరుగా కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. 1950 నంబర్‌కు ఫోన్ చేస్తే కాల్‌సెంటర్ ప్రతినిధి మాట్లాడతారు. ఆ తర్వాత ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్య, ఆధార్ సంఖ్యను చెబితే అప్పటికపుడు నమోదు చేస్తారు. ఇది కూడా సులభ ప్రక్రియ.

ఆదార్ కరెక్షన్



AADHAR SEARCH BY NAME OR PINCODE
user name: guest
password: guest123
***************
AADHAR SEEDING SELF
అందరికీ నమస్కారాలు. ఆధార్ అనేది 12 అంకెల భారతీయ ప్రాధికార సంస్థ విశిష్ట  గుర్తింపు సంఖ్య 
ప్రతి భారతీయ పౌరుడికి ఇది ఇవ్వబడుతుంది,పిల్లలతో సహా
ఆధార్ అనేది ఇప్పుడు అన్నిరకాల ప్రభుత్వ పధకాలలో అవసరం అయి వుంది.
ఆధార్ పొందుటకు దగ్గరలోని ఆదార్ సెంటర్ కు వెళ్లి నమోదు చేసుకోండి.
ఆదార్ లోని పేరు ,లింగం,పుట్టినతేది,మొబైల్ నెంబర్ ను,అడ్రెస్స్ ను ప్రస్తుతము రెండువేల పద్నాలుగు మార్చ్ వరకు
సరిచేసు కో వచ్చు /మార్చుకోవచ్చు అయితే ఇందుకు మీ మొబైల్ నెంబర్ ఆదార్ లో నమోదు అయి ఉండాలి లేకపోయినప్పటికినీ కొత్త మొబైల్ నెంబర్ ఇవ్వవచ్చు .ఇంతకుముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ పోతే .పోస్ట్  ద్వారా మాత్రమే పంపుకోవాలి.
ఆదార్ స్టేటస్ ను తెలుసు కోవ చ్చు .UIDAI అనేది ఆదార్ వెబ్ సైట్  సంక్షిప్తనామము. మరింత సమాచారం కోసం కింద చూడండి.
ఈ క్రింద ఇవ్వ బడిన వెబ్ సైట్ లింక్ ల ద్వారా అన్ని రకాల సమాచారం పొందండి. ప్రస్తుతానికి అనేక మందికి ఆదార్ కార్డు అందలేదు .అయినప్పటి కీ ఒకసారి మీ ఆధార్ స్టేటస్ చెక్ చేసుకోవాలి ఒకవేళ మీ వివరాలు నమోదుకాలేదు మళ్ళీ కేంద్రానికి వెళ్ళండి అని వచ్చినట్లయితే దగ్గరలోని ఆదార్ కేంద్రాన్నిలేదా మండల రెవెన్యూ అధికారి గారిని కలవండి. విషయం చెప్పిన తరవాతనే మరలా నమోడుకండి.
*ఈ పైన తెలిపిన సమాచారం మాకు తెలిసినది మాత్రమే
*ఇది పూర్తిగా అన్ని విషయాలను మీకు తేలపలేక పోవచ్చు
*మరింత సమాచారం కోసం ఆదార్ వెబ్ సైట్ ను లేదా రెవిన్యూ అధికారులను అడిగి సమాచారం పొందవచ్చు.








ఆదార్ కరెక్షన్ ఫారం కొరకు క్రింది ఫైల్ లింక్ మీద క్లిక్ చేయండి


ఆధార్ కరెక్షన్ ఫారం ను పోస్ట్ ద్వారా పంపుటకు సూచనలు,అవసరమయిన పత్రాల కొరకు క్రింది లింక్ ను నొక్కండి.

ఆధార్ కార్డును మీ SBI బ్యాంక్ అకౌంట్ తో అనుసంధానం చేసుకొనుటకు కింది ఫైల్ మీద నొక్కండి డౌన్లోడ్ చేసుకొని ఫారం ను పూరించి బ్యాంక్ లో ఇవ్వండి


ఆదార్ కార్డు డౌన్లోడ్ చెయ్యడo

How To Download Aadhar Card / How To Check Aadhar Card Status 





ఆదార్ కార్డ్ అనేది ప్రతి భారతీయుడి అంతర్జాతీయ గుర్తింపు. ఆదార్ కార్డు పొందడం మన అందరి హక్కు. ఇందులో భాగంగా మన ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం గత కొంత కాలం గా రాష్ట్ర వ్యాప్తం గా వందలాది నమూదు కేంద్రాలను ఏర్పాటు  చేసి మరీ ఆదార్ కార్డ్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసింది . ఇంత ముక్యమైన ఐడెంటిఫికేషన్ కార్డ్ కోసం వేళల్లో ప్రజలు ఆధర్ కార్డు కేంద్రాల వద్ద నమోదు చేసుకుంటున్న మాట వాస్తవం . గతం లో కొంత మంది ఆధర్ కార్డు కు అప్లై చేసుకున్న అబ్యార్డులకు ఆధర్ కార్డు లు నేరుగా వారి వారి ఇళ్ళకు పంపడం జరిగింది . ఈ ప్రక్రియలో ఆధర్దా కార్డు అందుకొని మరియు తప్పు చిరునామా తో చేరుకొని వాళ్ళ కోసం ఆదార్ అథారిటీ ఇంటర్నెట్ లలో నుండే డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది. ఒక వేల వారి ఆధర్ కార్డు వివిధ కారణాల వాళ్ళ రద్దు చేయబడినట్లు ఐతే వాళ్ళు మరొక సారి ఆదార్ స్లాట్ ని  బుక్ చేసుకొని ఇంటర్ నెట్ నుండి వాళ్ళ ఆదార్ కార్డు  ని న్లోడ్ చేసుకొనే సదుపాయం అందుబాటు లో ఉంది .

చాల మందికి ఇక్కడే సందేహాలు వస్తున్నాయి అందులో బాగంగా వారి సందేహాలను నివృత్తి చెయ్యడం లో బాగం గా ఈ రోజు మేము మీ ముందుకు ఆదార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చెయ్యాలో ఆదార్ కార్డు స్టేటస్ ఎలా చెక్ చెయ్యాలో సవివరం గా వివరించడానికి మీ ముందుకు వచ్చాము . ముందుగా ఈ వివరాలు తెలుసుకునే తప్పుడు మీ ఆదార్ కార్డు రిగిస్తేర్ చేసుకొన్న సమయం లో మీకు ఇచ్చిన నమోదు రసీదు ని మీ దగ్గర పెట్టికోంది. ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి ఆధర్ కార్డు స్టేటస్ చెకింగ్ అని టైపు చెయ్యండి ఇప్పుడు ఎంటర్ ని కొట్టడం ద్వారా మీకు ఆధర్ వెబ్ సైట్ మొదట కనపడుతుంది .

ఆధర్ కార్డు స్టేటస్ చెక్ చెయ్యడానికి :

ఆ వెబ్ సైట్ ని ఓపెన్ చేసి కుడి పక్క ఉన్న నాలుగవ ఆప్షన్ చెక్ యువర్ ఆదార్ కార్డు స్టేటస్ ని క్లిక్ చెయ్యండి. ఇప్పుడు మీకు మరో కొత్త పేజి ఓపెన్ అవుతుంది అందులో క్లిక్ హియర్ అని ఉన్న చోట కర్సర్ ని ఉంచి క్లిక్ ఇవ్వండి అల చెయ్యడం వాళ్ళ మీరు మరో కొత్త పేజి లోకి తెసుకు వేల్లబడుతారు . అక్కడ ఆదార్ కార్డు నమోదు చేసుకున్నప్పుడు ఇచ్చిన రసీదు లో ఇవ్వబడిన ఎన్రోల్ల్మేంట్ నెంబర్ ని మరియు టైం ని నింపాలి . తదుపరి ఆ పేజి లో ఇచ్చిన కాప్త్చ కోడ్ ని ఎంటర్ చెయ్యాలి. అన్ని మరొకసారి సరి చూసుకొని చివరగా సబ్మిట్ ని నొకండి. ఒకవేళ మీ ఆదార్ కార్డు ఇంతకూ ముందే జెనరేట్ అయి ఉన్నట్లు ఐతే అక్కడ యువర్ ఆదార్ కార్డు హాస్ బీన్ జనరేతద్ అని లేని చొ యువర్ ఆదార్ కార్డు హాస బీన్ రిజేక్టేడ్ అని చూపిస్తుంది .

 ఆదార్ కార్డు డౌన్లోడ్ చెయ్యడానికి :

Check Aadhar Card Status And Download

ఆదార్ కార్డు డౌన్లోడ్ చెయ్యడానికి గూగుల్ లో కి వెళ్లి e aadhar card download అని ఇవ్వడం ద్వారా మీకు మొదట పేజి లో ఆధర్ కార్డు వెబ్ సైట్ కనపడుతుంది దాన్ని ఓపెన్ చేసి మీకు ఇచ్చిన రసీదు లో ఉన్న ఎనరోల్ మెంట్  నెంబర్ ని మరియు డేట్ ని నింపాలి తదుపరి మీ పూర్తి పేరు (ఆదార్ కార్డు లో యా పేరు ఇస్తే అదే పేరు ఇవ్వాలి మార్చకూడదు ) మరియు మీ ఏరియా పిన్ కోడ్ ఇవ్వాలి. చివరగా కాప్త్చా కోడ్ ని నింపి సబ్మిట్ ని క్లిక్ చెయ్యాలి . ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చెయ్యమని అడుగుతుంది అక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఇచ్చి సబ్మిట్ ఇవ్వాలి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ కి ఆరు అంకెల నెంబర్ ని పంపుతారు ఆ నెంబర్ ని సెక్యూరిటీ కోసం ఎప్పటికప్పుడు మారుస్తారు ఆ నెంబర్ ని వెబ్సైటు లో ఎంటర్ చేసి సబ్మిట్ ఇవ్వడం ద్వారా  మీరు మీ ఆధర్ కార్డు ని డౌన్లోడ్ చేసుకోగలరు . డౌన్లోడ్ ఐన ఆదార్ కార్డ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని బాద్ర పరుచుకోగలరు

ఆన్లైన్ లో ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి

ఆన్లైన్ లో ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి


మీరు ఆధార్ కార్డు కోసం Apply చేసుకోన్నారా ? లేదంటే వెంటనే Apply చేసుకోండి , Apply చేసుకోన్నవారికి  ఆధార్ కార్డు పోస్ట్ ద్వారా పంపబడుతుంది . కొంతమందికి పోస్ట్ లో రావడం ఆలస్యమవుతుంది , ఇలాంటి వారికోసం ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం కలిపించబడింది . క్రింద ఇవ్వబడిన Steps Follow అవుతూ మీ ఆధార్ కార్డు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోండి .

ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి కావలసినవి :

  • Enrollment Number Acknowldgement form పైన Right Side వుంటుంది )
  • Resident Name (ఆధార్ కార్డు కోసం మీరు దరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరు )
  • Area Pin Code 
  • ఆధార్  లో Register రిజిస్టర్ చేసుకునప్పుడు  మీరు Enter చేసిన మీ మొబైల్ నెంబర్ కలిగిన మీ మొబైల్ 








డౌన్లోడ్ ఎలా చేయాలి : 

  • https://eaadhaar.uidai.gov.in   Open చేయండి 
  • Enrollment Number , Resident Name(ఆధార్ కార్డు కోసం మీరు దరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరు ) , Area Pin Code , Capcha text Enter చేయండి . (అన్ని వివరాలు సరిగా వున్నాయో లేదో చూసుకోండి )
  • Submit బటన్ పైన Click చేయండి . 
  • ఆధార్  లో Register రిజిస్టర్ చేసుకునప్పుడు  మీరు Enter చేసిన  మొబైల్ నెంబర్ కలిగిన మీ మొబైల్ correct , కాదో (చివరి 3 నంబర్స్ ) అడుగుతుంది , correct అయితే Yes పైన క్లిక్ చేయాలి . తర్వాత  మొబైల్ కి మెసేజ్ వస్తుంది . 
  • మొబైల్ కి వచ్చిన OTP నెంబర్ ని enter చేసి Submit పైన క్లిక్ చేయాలి 
  • తర్వాత వచ్చె స్క్రీన్ లో Download your e-Aadhaar బటన్ పైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డు (PDF ఫైల్ ) డౌన్లోడ్ అయిపోతుంది . 
  • PDF ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు password అడుగుతుంది ,  Area Pin Code ఎంటర్ చేస్తే ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది 
 


థాంక్స్ 
మీ 
అశోక్ చేలిక

ఆధార్ కార్డు లోని మీ వివరాలు Update చేసుకొండిలా



ధార్ కార్డు లోని మీ వివరాలు Update చేసుకొండిలా

 

 

 

 

 

మీ ఆదార్ కార్డు లో తప్పులు జరిగాయా?
అయితే సరి చేసుకోండి
>> ఎడిట్ చేసుకున్న తరువాత కొన్ని రోజులకు అది చెక్ చేసుకొని aspect అయితే ఆన్లైన్ లోనే ప్రింట్ తీసుకోవాలి .
>> అంతే తప్ప మళ్ళి పోస్ట్ లో గాని రాదు ... ప్రస్తుతం మీ ఆదార్ లో తప్పులను సరి చేసుకునే అప్లికేషను ఫారం కోరకు ఈ లింక్ ని చూడవచ్చు
https://ssup.uidai.gov.in/web/guest/update
అండ్
>> సవరణ/తప్పులు జరిగినదో లేదో తెలుసుకోవడానికి ఈ లింక్ https://ssup.uidai.gov.in/web/guest/check-status
>> మరియు చివరగా మీ ఆదార్ డౌన్లోడ్ కొరకు ఈ లింక్ చూడవచ్చు
https://eaadhaar.uidai.gov.in/


ఆధార్ కార్డు లో వివరాలు ( పేరు , చిరునామా , పుట్టిన తేది  ) తప్పుగా ముద్రించ బడినప్పుడు వివరాలు సవరించుకొనే వీలు వుంది , ఈ క్రింది ఇవ్వబడిన లింకు ను ఓపెన్ చేసి , క్రింద ఇవ్వబడిన ప్రకారం వివరాలను సరిచేసుకోవచ్చు .

1. ఈ లింకు ను ఓపెన్ చేయాలి  https://ssup.uidai.gov.in/update
2. ఆధార్ నెంబర్ ను మరియు క్రింది Capcha కోడ్ Enter చేసి  Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి
3. తర్వాత Enter your Mobile దగ్గర నెంబర్ Enter చేసి Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి  
4.మొబైల్ కి pin , SMS చేయబడితుంది , తర్వాత Enter received OTP pin Enter చేసి Login బటన్ పైన క్లిక్ చేయాలి . 
5. ఏ వివారాలు సరిచేయాలో ఆ Option ను చెక్ చేసి Submit బటన్ పైన క్లిక్ చేయాలి . 
6. తర్వాత వచ్చె Screen లో modify చేయాల్సినవివరాలు enter చేసి , Submit Update Request బటన్ పైన క్లిక్ చేయాలి 
7. తర్వాత వచ్చే స్క్రీన్ లో proof కోసం డాక్యుమెంట్ attachment చేసి , Submit బటన్ పైన క్లిక్ చేయాలి . 
తర్వాత మొబైల్ కి SMS ( URN number ) వస్తుంది . వచ్చిన URN నెంబర్ ద్వారా Update status చెక్ చేసుకోవచ్చు . 

మీ బందువులు లేక స్నేహితులు ప్రయాణిస్తున్న రైలు Exact గా ఎక్కడ వుందో తెలుసుకొండి

మీ బందువులు లేక స్నేహితులు ప్రయాణిస్తున్న రైలు Exact గా ఎక్కడ వుందో తెలుసుకొండి


మీ బందువు లు లేక మీ ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా వేరే చోటునుండి మీ ప్రాంతానికి రైలు లో ప్రయాణం చేస్తుంటే , వారు ప్రయాణిస్తున్న రైలు ఎక్కడ వుందో , లేదా యెంత ఆలస్యం గా వస్తుందో ఆన్లైన్ లో తెలుసుకోవాలనుకోనేవారికి , Rail Radar వెబ్సైటు బాగా ఉపయోగపడుతుంది .

ఈ వెబ్సైటు ద్వారా ప్రయాణిస్తున్న రైలు Exact గా ఎక్కడ వుందో తెలుసుకోవచ్చు . ఈ Rail Radar కి గూగుల్ Maps అనుసందానం చేసి రూపొందించారు . ఈ వెబ్ సైట్ ని ఓపెన్ చేసి Search లో  TRAIN NUMBER లేదా NAME ని టైపు చేసి Go బటన్ పైన క్లిక్ చేస్తే రైలు ఎక్కడ వుందో exact గా తెలుసుకోవచ్చు . తర్వాత వచ్చే స్టేషన్ కి ఎంత దూరం లో వుందో కూడా తెలుసుకోవచ్చు . 


http://railradar.trainenquiry.com  Open చేయండి 

ఉదాహరణకి : Krishna express ఎక్కడవుందో తెలుసుకోవడానికి క్రింది సెర్చ్ లో చూడండి ... Vijayawada స్టేషన్ కి ఎప్పుడు వస్తుందో search చేస్తున్నాం , Journey/Boarding/Arrival station* దగ్గర train ఎక్కడకు రావాలో ఆ స్టేషన్ name , Journey/Boarding/Arrival date* దగ్గర Date 
ఇవ్వాలి . 



Date select చేసిన తర్వాత , మనకు details చూపబడుతాయి. క్రింది Image గమనించండి .














ఏ ఏ స్టాప్ లలో రైలు ఆగుతుందో , ఒకవేళ రైలు ఆలస్యం అయితే Latest Status కోసం On Run లింక్ ( పైన చిత్రం లో ) పైన క్లిక్ చేస్తే వేరే విండో లో మనకు వివరాలు చూపబడుతాయి ( క్రింది లో చూడండి ).


అంతేకాదు ఈ అప్లికేషను ని మొబైల్ ఫోన్ లలో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు . 

గూగుల్ Store లో Train radar అని search చేసుకోవచ్చు , లేదా క్రింది లింక్ ని క్లిక్ చేయండి . 

Rail Radar for Mobile Phones

ఇంగ్లీష్ PDF డాక్యుమెంట్ లను చదవడం కష్టం గా ఉందా? అయితే వినండి ఇలా

ఇంగ్లీష్ PDF డాక్యుమెంట్ లను చదవడం కష్టం గా ఉందా? అయితే వినండి ఇలా


English లో వున్న PDF ఫైల్స్ ని కొందరికి చదవాలంటే కష్టం గా వుంటుంది . అలా చదవాల్సిన పనిలేకుండా వినవచ్చు . వినడానికి ఎటువంటి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు , PDF ఫైల్స్ ని Adobe Acrobat Reader ని లో Options అందుబాటులో వున్నాయి . వీటిని వుపయోగించి PDF ఫైల్స్ ని చాలా సులువు గా వినవచ్చు.
ఎలా చేయాలో చూద్దామా ...



  • PDF file ఓపెన్ చేయాలి ( ఇంగ్లీష్ మాత్రమె )
  • Menu బార్ లో View లో Read Out Loud ఆప్షన్ లో Active Read Out Load ( Shift + Ctrl + Y ) క్లిక్ చేసి Read ఆప్షన్ ను Activate చేయాల్సి వుంటుంది.
  • Open చేసిన పేజి మాత్రమె వినాలనుకొంటే Read This Page Only  ( Shift + Ctrl + V ) క్లిక్ చేయాలి.
  • Document మొత్తం వినాలనుకొంటే Read To End of Document ( Shift + Ctrl + B ) క్లిక్ చేయాలి.
  • Read ఆప్షన్ ను Deactivate చేయాలంటే  Deactivate Read Out Load ( Shift + Ctrl + Y ) క్లిక్ వుంటుంది.

ఆధార్ కార్డు పోయిందా ?

ఆధార్ కార్డు పోయిందా ?


చాలా మంది ఆధార్ కార్డు కోసం apply చేసుకొని వుంటారు , కొందరికి ఆధార్ కార్డు వచ్చి ఉంటుంది , కొందరు మరచిపోయి ఎక్కడో పెట్టేసి వుంటారు , మరేఇతర కారణాలవల్ల ఆదార్ కార్డు పోయి వుంటుంది , అలాంటి వారు బయపడవలసిన అవసరం లేదు .

ఈ క్రింది చెప్పిన విదంగా చేసి Duplicate ఆధార్ కార్డు ని పొందవచ్చు ,

1. మొదట UIDAI  contact Centre ( 1800-180-1947 ) కి ఫోన్ చేసి , వారికి మీ ఆధార్ కార్డు పోయినట్లు తెలపాలి. చాలా వరకు ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే busy గా వుంటుంది , అలా busy గా వుండి Line కలవనప్పుడు క్రింది విదంగా చేయండి , మీ అదార్ కార్డు నెంబర్ గుర్తు వుంటే నెంబర్ మరియు address వివరాలు తెలుపడం  ద్వారా డూప్లికేట్ ఆధార్ కార్డు పొందవచ్చు . 
2. ఆధార్ కార్డు పోగొట్టుకోన్నప్పుడు తర్వాతి ప్రత్యామ్నాయం Enrollment Number, మీ  Enrollment Number

 మీ దగ్గర ఉన్నట్లయితే సులభం గా ఆధార్ కార్డు తిరిగి పొందవచ్చు . 

online లో మీ Enrollment Number, date time, మొబైల్ నెంబర్ మొదలగు వివరాలను ఇవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు . ఎలా చేయాలో క్రింది లింక్ క్లిక్ చేయండి .



౩. Enrollment Number, date time, మొబైల్ నెంబర్ మొదలగు వివరాలను కూడా పోగొట్టుకొంటే , ఆధార్ కార్డు రిజిస్టర్ కేంద్రం దగ్గరకు వెళ్లి మీ పేరు , చిరునామాతో వెతికి పొందవచ్చు .

గమనిక : ఆధార్ కార్డు నెంబర్ ను Safe place లో బద్రపరుచుకోండి , 12 అంకెల ఆధార్ కార్డు మీ డైరి లోనో లేదా మొబైల్ లోనో రాసిపెట్టుకోండి .

13, జూన్ 2015, శనివారం

చరావని ద్వార బ్యాంకింగ్ సేవలు

చరావని  ద్వార బ్యాంకింగ్  సేవలు 

 

  1. మొదటగా మీ మొబైల్ నుండి ఒక మెసేజ్ టైపు చేయండిలా MBSREG 09223440000 అనే నెంబర్ కు పంపండి 

  2. తరువాత మీరు ఇ  మోడ్ లో మొబైల్ బ్యాంకింగ్ సేవలను వాడుకోవచ్చు 
  3. USSD  లేదా sms లేదా state bank freedom application ద్వార (ఈ అప్లికేషను ఆండ్రాయిడ్ మరియు జావా ఫోన్ లలో పనిచేయును 
  4. USSD  కొరకు *595# లేదా *99# అను నెంబర్ ను మీ మొబైల్ నుండి డయల్ చేయవలెను 
  5.  మీ డిఫాల్ట్ పాస్వర్డ్ చేంజ్ చేయాలి 
  6. తరువాత బ్యాంకు లేదా ATM  నుండి మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేయాలి 
                                                లేదా
  1. అప్లికేషను ఆండ్రాయిడ్ లలో వాడె వారు గూగుల్ ప్లే స్టోర్ నుండి అప్ప్స్ ను డౌన్లోడ్ చేచుకోవాలి
  2.  మీ డిఫాల్ట్ పాస్వర్డ్ చేంజ్ చేయాలి 
  3. తరువాత బ్యాంకు లేదా ATM  నుండి మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేయాలి