ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, జూన్ 2015, ఆదివారం

పర్సనల్ కంప్యూటర్ స్పీడ్‌గా పనిచేయడానికి టిప్స్

పర్సనల్ కంప్యూటర్ స్పీడ్‌గా పనిచేయడానికి టిప్స్ 

 

 
 
 పర్సనల్ కంప్యూటర్ చాలా నెమ్మదిగా పని చేస్తోందా? కారణం అవసరంగా పేరుకుపోయిన ఫైల్స్‌ కావచ్చు. మన కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టించే వైరస్‌లు కావచ్చు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ లేకపోవడం వల్ల కావచ్చు. ఈ నేపథ్యంలో 'పర్సనల్ కంప్యూటర్ వేగాన్ని పెంచే చిట్కాలు, సాఫ్ట్‌వేర్‌లు ఏమనేవి చూద్దాం... సీ,డీ,ఈ,ఎఫ్‌ డ్రైవ్‌లను ఎప్పటికప్పుడు క్లీన్‌, డీఫ్రాగ్మెంటేషన్‌ చేయడం ద్వారా పీసీ వేగాన్ని కొంతమేర పెంచొచ్చు. అందుకు MyComputer-> Drive-> Right Click-> Properties-> Tools-> Defragment Now క్లిక్‌ చేయాలి. టెంపరరీ ఫైల్స్‌ తీసేయాలంటే Start-> Runలోకి వెళ్లి %temp%, recent అని టైప్‌ చేసి ఓకే చేయండి. వచ్చిన విండోలోని టెంపరరీ ఫైల్స్‌ని డిలీట్‌ చేయండి. స్టార్ట్‌అప్‌లో అక్కర్లేని పొగ్రాంలను డిసేబుల్‌ చేయవచ్చు. అందుకు రన్‌లోకి వెళ్లి msconfig టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కండి. వచ్చిన విండోలోని 'స్టార్ట్‌అప్‌' ట్యాబ్‌లోకి వెళ్లి అక్కర్లేని ప్రొగ్రాంలను అన్‌చెక్‌ చేసి సిస్టంని రీస్టార్ట్‌ చేయండి. 'ట్యూన్‌అప్‌ యుటిలిటీస్‌' సాఫ్ట్‌వేర్‌లో సిస్టమ్ సామర్థాన్ని పెంచే సదుపాయాలు ఉన్నాయి. డెస్క్‌టాప్‌పై తక్కువ ఐకాన్లు ఉంచాలి. ఎక్కువ మెమొరీతో కూడిన ఫైల్స్‌ పెట్టడం మంచిది కాదు. CCleaner, Zappit System Cleaner, SS Disk Cleaner టూల్స్‌తో అనవసరమైన ఫైల్స్‌ని తొలగించవచ్చు. అక్కర్లేని సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలి. అందుకు సిస్టంలోనే Add/Remove సిద్ధంగా ఉంది. Start-> Settings-> Control Panel-> Add or Remove Programs క్లిక్‌ చేసి అక్కర్లేని వాటిని తొలగించాలి. యాంటీ వైరస్‌లను అప్‌డేట్‌ చేయాలి. టెంపరరీ ఫైల్స్‌ని మాన్యువల్‌గా తొలగించడం కష్టం అయితే Temp File Cleaner నిక్షిప్తం చేసుకోండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి