ఆండ్రాయిడ్ కీబోర్డ్‌తో ఇప్పుడు తెలుగు కూడా టైప్ చేయవచ్చు
ఆండ్రాయిడ్ 4.2.2 తో తెలుగు
అక్షరాలు చూడడానికి మద్దతును కల్పించిన గూగుల్ మొన్న విడుదలైన ఆండ్రాయిడ్
5.0 లాలిపప్‌లో తెలుగుభాషలో ఫోన్‌ని వాడుకోనే వెసులుబాటునుచేర్చడం
జరిగింది. దానితో పాటు ఎటువంటి అధనపు కీబోర్డ్ యాప్ ఇన్‌స్టాల్ చేయనవసరం
లేకుండానే ఆండ్రాయిడ్లో వచ్చే గూగుల్ కీబోర్డ్ తో తెలుగుటైప్ చేయడానికి
కావససిన మద్దతును కూడా చేర్చారు. అయితే అధికారికంగా ఆండ్రాయిడ్ 5.0
విడుదలైనప్పటికి మనవరకు ఆ అప్‌డేట్ రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు. అయితే
గూగుల్ నుండి అప్‌డేట్ వచ్చినప్పటికి తయారీదారులందరు వారి పరికరాలకు
అప్‌డేట్‌ని విడుదల చేయకపోవచ్చు కూడా. అయినప్పటికి అన్ని ఆండ్రాయిడ్
పరికారాలు వాడేవారు కూడా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. తొందరలోనే రాబోతున్న
గూగుల్ కీబోర్డ్ యాప్ అప్‌డేట్‌తో తెలుగుతో పాటు మరో 8 భారతీయ భాషలు టైప్
చేయవచ్చు. దానికి మనం గూగుల్ కీబోర్డ్ యాప్ 3.2 అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్
చేసుకుంటే సరిపోతుంది. అప్‌డేట్ రాకముందే ఇప్పుడే గూగుల్ కీబోర్డ్ యాప్
3.2 ప్రయత్నించాలనుకుంటే
ఇక్కడ నుండి ఎపికే ఫైల్‌ని దింపుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎపికే ఫైల్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలియకపోతే
ఇక్కడ
చూడండి. యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత క్రింది చిత్రాలలో వలే ఫోను
సెట్టింగ్స్ – లాంగ్వేజి&ఇన్‌పుట్ సెట్టింగ్ – గూగుల్ కీబోర్డ్
సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడనుండి తెలుగును ఎంచుకొని టైప్ చేసుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి