వైరస్ ల వల్ల ఫోల్డర్స్ హిడెన్ లోకి వెళితే...
ఈ మధ్య నా పెన్ డ్రైవ్ ను నెట్ సెంటర్ లో వాడాను. దానిని నా సిస్టమ్ కి తిరిగి కనెక్ట్ చేసి చూస్తే ఫోల్డర్స్ అన్నీ మాయ మయ్యి పోయి వాటి స్థానం లో ఏవో షార్ట్ కట్శ్ వున్నాయి..పెన్ డ్రైవ్ లో ని వైరస్ ను నా యాంటీ వైరస్ క్లీన్ చేసింది కానీ దాయబడ్డ ఫోల్డర్స్ ను తిరిగి తెప్పించలేక పోయింది..
దీనికి నెట్ లో దొరికిన పరిష్కారం.
సెర్చ్ బార్ లో cmd అని టైప్ చేసి రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ అని సెలక్ట్ చేసి రన్ చెయ్యండి..
అప్పుడు కమాండ్ ప్రాంప్ట్ లో క్రింది విధంగా టైప్ చెయ్యండి..
"attrib F:*.* /d /s -h -r -s "
ఇక్కడ F:స్థానం లో మీ పెన్ డ్రైవ్ యొక్క లెటర్ ను పరిక్షేపించండి..
దీనితో మీ సమస్య పూర్తిగా పరిష్కరించబడుతుంది.. ఇది చేసే ముందు మీ పెన్ డ్రైవ్ ను శక్తివనంతమైన యాంటీ వైరస్ తో స్కాన్ చెయ్యండి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి