ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, జులై 2015, శనివారం

తెలంగాణలోని నిరుద్యోగులకు నేరుగా చరావని కి ఉద్యోగ సమాచారం

తెలంగాణలోని  నిరుద్యోగులకు నేరుగా చరావని కి ఉద్యోగ సమాచారం


 
 - తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఒక్కసారి నమోదు (వన్టైమ్ రిజిస్ట్రేషన్-ఓటీఆర్) పేరిట నిరుద్యోగులకు సులభమైన దరఖాస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది. తద్వారా ఉద్యోగాల సమాచారాన్ని నేరుగా అభ్యర్థుల సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్) రూపంలో పంపేలా ఏర్పాటు చేసింది. Education Newsఉద్యోగ ప్రకటనలతో సంబంధం లేకుండా నిరుద్యోగ అభ్యర్థులు ఇప్పటి నుంచే పీఎస్సీ వెబ్సైట్ www.tspsc.gov.in ద్వారా తమ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. ఈ సమాచారాన్ని అభ్యర్థులే సవరించుకునే అవకాశం ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ తరహాలో పనిచేస్తుంది. ఇదంతా పీఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా అందిస్తుంది. ఉద్యోగ ప్రకటనలు వచ్చాక.. ఈ సమాచారాన్ని ఆన్లైన్ అప్లికేషన్తో అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఓటీఆర్ కీలకమైంది. ఒక్కసారి తమ వ్యక్తిగత, అర్హతల సమాచారాన్ని పీఎస్సీ వెబ్సైట్లో నిక్షిప్తం చేశారంటే.. పది అంకెల పాస్వర్డ్, నమోదు సంఖ్య ఈ-మెయిల్కు, సెల్ఫోన్కు సమాచారం వస్తుంది. ఒకటికంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా వివిధ సందర్భాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా పదేపదే సమాచారాన్ని నింపాల్సిన అవసరం ఉండదు. అభ్యర్థి దరఖాస్తును ఆధార్తోనే కాకుండా ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న ధ్రువీకరణ పత్రాల తనిఖీని కూడా అనుసంధానిస్తారు. దీంతో ఏవైనా నకిలీ పత్రాలున్నా దొరికిపోతాయని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వివరించారు. ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన రుసుం చెల్లింపును ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)తో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే ఎస్బీహెచ్ పీఎస్సీ కోసం ప్రత్యేక శాఖను తెరవబోతోంది.




మీ 
అశోక్ చేలిక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి